Begin typing your search above and press return to search.

ప్రియాంక స్టార్ డమ్ ‘అన్ ఫినిష్డ్’.. రికార్డులు తిరగరాస్తున్న బుక్!

By:  Tupaki Desk   |   20 Feb 2021 1:35 PM IST
ప్రియాంక స్టార్ డమ్ ‘అన్ ఫినిష్డ్’.. రికార్డులు తిరగరాస్తున్న బుక్!
X
బాలీవుడ్ టూ హాలీవుడ్ ప్ర‌మోటెడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్టార్ డ‌మ్ అంత‌కంత‌కూ రెట్టింపు అవుతోంది. సినీ ఇండ‌స్ట్రీ నుంచి యూనిసెఫ్ కార్య‌క‌ర్త వ‌ర‌కు సాగిన‌ ప్ర‌యాణాన్ని ఇటీవ‌ల‌ ఓ పుస్త‌క రూపంలో తీసుకొచ్చింది ప్రియాంక‌. ‘అన్ ‌ఫినిష్డ్’ పేరుతో అచ్చ‌యిన ఈ పుస్తకం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పుతోంది.

2018 లో అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్‌తో వివాహం అనంత‌రం ఇండియా నుంచి షిఫ్ట్ అయిన ప్రియాంక‌.. ఇప్పుడు హాలీవుడ్ న‌టిగా వెలుగొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను నిర్వ‌ర్తించిన బాధ్య‌త‌లు, వాటి తాలూకు జ్ఞాప‌కాల స‌మాహారంగా ‘అన్ ‌ఫినిష్డ్’ పుస్త‌కాన్ని తీసుకొచ్చారు. సినీ న‌టిగా, ప్రొడ్యూసర్ గా, రైట్స్ యాక్టివిస్ట్ గా, యునిసెఫ్ ప్ర‌చార‌క‌ర్తగా ఎన్నో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు ప్రియాంక‌.

కాగా.. విడుద‌లైన వెంట‌నే ఫుల్ క్రేజ్ సంపాదించిందీ పుస్త‌కం. ఆవిష్క‌రించిన వారం రోజుల్లోనే అమ్మ‌కాల విష‌యంలో దుమ్ము లేపింది. ఏకంగా.. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా ‘అన్‌ఫినిష్డ్’ బుక్ స్థానం దక్కించుకోవ‌డం విశేషం.

దీంతో.. ఫుల్ హ్యాపీగా ఉంది ప్రియాంక. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. త‌న సినీ జీవితంలో ప్ర‌ధాన సంఘ‌ట‌న‌లు, మైలురాళ్ల‌కు సంబంధించిన పిక్చర్స్ తో ఓ వీడియో రూపొందించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ సంద‌ర్భంగా.. ‘అన్‌ఫినిష్డ్’ బెస్ట్ సెల్ల‌ర్‌గా నిలిపినందుకు ఫ్యాన్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

అయితే.. వీడియో కూడా వైర‌ల్ అవుతుండ‌డం విశేషం. పోస్టు చేసిన 2గంటల్లోనే 53వేల మంది ఈ వీడియోను చూశారు. ఇక‌, బుక్ రిలీజ్ చేసినప్పటి వీడియో మాత్రం ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 30లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు.