Begin typing your search above and press return to search.

మాన‌స్ ల‌వ్ లో ప్రియాంక సింగ్!

By:  Tupaki Desk   |   29 Oct 2021 3:30 PM GMT
మాన‌స్ ల‌వ్ లో ప్రియాంక సింగ్!
X
`బిగ్ బాస్ సీజ‌న్-5` స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `సీజ‌న్ 4` కాస్త నిరాశ‌ప‌రిచినా సీజ‌న్ 5 మాత్రం మొద‌టి నుంచి ఆస‌క్తిగానే సాగుతోంది. కంటెంస్టెంట్ల ఎంపిక‌లోనే బిగ్ బాస్ స‌గం స‌క్సెస్ అయ్యారు. ఆటుపై గేమ్ అంతే ఆస‌క్తిగా సాగుతోంది. బిగ్ బాస్ మ‌ళ్లీ గ‌త‌వైభ‌వాన్ని అందుకుంటుంద‌నే టాక్ సైతం బ‌లంగా వినిపిస్తోంది. ఇక సీజ‌న్ 5 లో ట్రాన్స్ జండ‌ర్ ప్రియాంక సింగ్ స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అంద‌మైన ఆడ‌పిల్లలా క‌ట్టుబొట్టుతో అచ్చం అమ్మాయినే త‌ల‌పిస్తోంది.

ఆడ‌వాళ్లే అసూయ‌ప‌డేంత అందంగా త‌యార‌వుతోంది. సెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే ప్రియాంక సింగ్ బాగా ఫోక‌స్ అవుతుంది. సోష‌ల్ మీడియాలో సైతం ప్రియాంకపై నెటి జ‌నులు పాజిటివ్ గానే ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక సింగ్ మాన‌స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న‌ట్లు మొద‌టి నుంచి టాక్ వినిపిస్తోంది. సెట్ లో చోటు చేసుకునే స‌న్నివేశాలు చూస్తే ఆ సంగ‌తి స్ప‌ష్టంగా అర్ద‌మవుతుంది. సీజ‌న్ 5 లోనూ జంట‌లు ఉంటార‌నుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రియాంక సింగ్ మాన‌స్ తో చ‌నువుగా ఉండ‌టం అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

దీంతో మిగ‌తా కంటెస్టెంట్లు ఇద్ద‌రినీ ఆట‌ప‌ట్టిస్తున్నారు. ఇటీవ‌ల పెళ్లి టాస్క్ కూడా జ‌రిగిది. ఆ త‌ర్వాత మిగ‌తా కంటెస్టెంట్లు మాన‌స్-ప్రియాంక‌ల‌కు పెళ్లి కూడా చేసేసారు. ప్రియాంక మొద‌టి నుంచి మాన్ పై ఆస‌క్తిగా ఉండ‌టంతో పెళ్లి త‌ర్వాత మ‌రింత కనెక్ట్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త సీజ‌న్ లో ర‌వి-త‌మ‌న్న మ‌ధ్య ఇలాంటి స‌న్నివేశాలు చోటు చేసుక‌నేవి. ఇప్పుడు పింకీ-మాన‌స్ మ‌ధ్య రొమాన్స్ పండ‌టం విశేషం. ఇక లాక్ డౌన్ టాస్క్ లో భాగంగా గెల‌వ‌ని వాళ్లు బ‌య‌ట ప‌డుకున్న సంగ‌తి తెలిసిందే. అలా మాన‌స్ కూడా బ‌య‌టే ప‌డుకున్నాడు. దీంతో ప్రియాంక సింగ్ ప్రియుడికి ఎండ త‌గ‌ల‌కుండా పిల్లోనూ..స్కార్ప్ ని అడ్డుగా ఏర్పాటు చేసి త‌న మ‌న‌సులో భావాలు చెప్ప‌క‌నే చెప్పింది. ఇదంతా అన్ సీన్ వీడియోలో చూపించారు.