Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : ప్రియాంకగా మారిన తేజ వెనుక కథ

By:  Tupaki Desk   |   7 Sep 2021 6:13 AM GMT
#BIGGBOSS5TELUGU : ప్రియాంకగా మారిన తేజ వెనుక కథ
X
తెలుగు బిగ్ బాస్ లో ఇంతకు ముందు ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి సందడి చేసిన విషయం తెలిసిందే. ఆమె కాస్త అతి చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఆమె బయటకు వెళ్లి పోయింది. ఆతర్వాత కూడా ఎక్కడా పెద్దగా కనిపించలేదు. మళ్ళీ ఈ సీజన్ లో ట్రాన్స్ జెండర్ కోటాలో జబర్దస్త్ కమెడియన్ సాయి తేజ గా పరిచయం అయ్యి ఎక్కువ లేడి గెటప్స్ వేసి ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారి ప్రస్తుతం అందమైన ప్రియాంక సింగ్ గా పెరు దక్కించుకుని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియా లో మరియు వెబ్ మీడియాలో కూడా సందడి చేస్తుంది. యూట్యూబ్ లో స్టార్ గా మంచి పేరు దక్కించుకున్న ప్రియాంక సింగ్ కు అనూహ్యంగా బిగ్‌ బాస్ ఆఫర్‌ వచ్చింది.

తనలా ఎంతో మంది జెండర్ సమస్యతో బాధ పడుతున్నారు. వారందరికి తాను ఒక ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే తాను బిగ్‌ బాస్ లోకి వచ్చాను. ఊగిసలాట బతుకు వద్దు అనుకునే వారు ధైర్యంతో ముందడుగు వేస్తే తప్పకుండా వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు అనే మెసేజ్ తో ఆమె బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. మూడున్నర సంవత్సరాల క్రితం తేజ కాస్త ప్రియాంక గా మారింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పలేదు. తన కుటుంబ సభ్యులు అందరికి కూడా ఈ విషయం తెలుసు కాని తండ్రికి మాత్రం ఈ బిగ్‌ బాస్ వేదిక మీదు నుండి చెబుతున్నాను అంటూ నాగార్జున సమక్షంలో చెప్పిన విషయం తెల్సిందే. బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో ఆమె చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్‌ గా నిలిచింది.

అయితే ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నా లేదా డల్ గా ఉన్నా కూడా ఆమెకు జనాల నుండి ఆధరణ కరువయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రియాంక న్యూట్రల్‌ గా అందరితో కలిసి పోయేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. పదే పదే తన గురించి అందరు మాట్లాడుకునేలా చేసేందుకు ప్రయత్నించకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ప్రియాంక సింగ్ కు బిగ్‌ బాస్ ప్రేక్షకుల నుండి మంచి ఆధరణ దక్కుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో బలమైన కంటెస్టెంట్‌ గా ప్రియాంక కూడా నిలిచే అవకాశాలు లేకపోలేదు. గతంలో ఆ కంటెస్టెంట్ చేసిన తప్పులు చేయకుండా ప్రియాంక ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.