Begin typing your search above and press return to search.
భారత జాతి గౌరవం పెంచిన పీసీ
By: Tupaki Desk | 11 Aug 2019 4:00 PM ISTసందర్భోచితంగా మాట్లాడి అవతలివారి నోరు మూయించడం అన్నది ఎంతో గొప్ప స్కిల్. అలాంటి నైపుణ్యం ఉన్న యువతి కాబట్టే మిస్ యూనివర్శ్ కిరీటం గెలుచుకోగలిగారు ప్రియాంక చోప్రా. కేవలం అందంతోనే కాదు మేధోతనంతోనూ మెప్పిస్తేనే అంత గొప్ప స్థాయికి ఎదిగేందుకు ఛాన్సుంటుంది. ఇప్పుడు ఆ తెలివితేటల్ని మరోసారి నిరూపించారు ప్రియాంక చోప్రా.
తాజాగా లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఓ ప్రయివేటు కార్యక్రమంలో ఓ పాకిస్తానీ మహిళ నుంచి ఎదురైన ప్రశ్నకు స్పందించాల్సి వచ్చింది. ``నేను పాకిస్తానీని. అయినా మావాళ్లకు మీరు మంచి చేస్తే మద్ధతిచ్చాను. భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మీరు `జైహింద్` అంటూ ట్వీట్ చేశారు. యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మీరు అలా చేయొచ్చా? పాకిస్తాన్ లో అణు యుద్ధాన్ని ప్రేరేపిస్తావా?`` అంటూ సదరు పాకిస్తానీ సీరియస్ అవ్వడంతో ఆ వెంటనే దానికి పీసీ అంతే తెలివైన కౌంటర్ వేశారు. ``ఒక భారతీయురాలిగా నా దేశం విషయంలో నాకు గౌరవం బాధ్యత ఉన్నాయి. పాకిస్తాన్ లోనూ స్నేహితులు ఉన్నారు. నేను ఎవరినీ రెచ్చగొట్టలేదు. నువ్వెలా దేశం గురించి ఆలోచిస్తావో నేను కూడా అంతే. అరిచి పరువు తీసుకోకు`` అంటూ గట్టిగానే కౌంటర్ వేసారు పీసీ.
అంత సీరియస్ సన్నివేశంలో ఒక శాంతి ప్రభోదకురాలిలా పీసీ ఎంతో ప్రశాంతంగా ఆ అమ్మాయికి సమాధానం ఇవ్వడం ఆకట్టుకుంది. అంత తెలివైన సెలబ్రిటీ కాబట్టే అమెరికా కోడలు కాగలిగింది. భర్త నిక్ జోనాస్ కి సంఘంలో గుర్తింపు పెంచుతోంది. పీసీ నటిస్తున్న `ది స్కై ఈజ్ పింక్` త్వరలో రిలీజ్ కి రానుంది.