Begin typing your search above and press return to search.

ప్రియాంకను పూర్తి చేయనివ్వలేదే?

By:  Tupaki Desk   |   12 Nov 2018 10:37 AM GMT
ప్రియాంకను పూర్తి చేయనివ్వలేదే?
X
'టాక్సీవాలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పీచ్ లు మాత్రమే కాదు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఇచ్చింది. ఈ స్పీచ్ ఇవ్వడం కోసం రెండేళ్ళ నుండి వేచి చూస్తున్నానని తెలిపింది. హీరోయిన్ గా తన జర్నీ గురించి మాట్లాడింది.

విజయ్ దేవరకొండ ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా అది అందరినీ ఆకట్టుకుంటుందని.. అందుకే తన స్పీచ్ ని మ్యాచ్ చేయాలని ముందు రోజు రాత్రి పేపరు మీద స్పీచ్ రాసుకోవాలని ప్రయత్నించానని తెలిపింది. మొదటి స్పీచ్ కావడంతో కాస్త నెర్వస్ గా ఉందని.. కానీ స్పీచ్ ని ఎంజాయ్ చేస్తున్నానని కూడా చెప్పింది. అల్లు అర్జున్.. టాక్సీవాలా డైరెక్టర్.. నిర్మాతల గురించి మాట్లాడింది.. కానీ ఆమె స్పీచ్ ఇస్తూ ఉండగా ఆడిటోరియంలో ఉన్న జనాలు గోల చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎందుకలా చేస్తున్నారో ప్రియాంకకు అర్థం కాలేదు.. అంతలో యాంకర్ సుమ దగ్గరకు వచ్చి మైక్ తీసుకుని ప్రియాంక కు థ్యాంక్స్ చెప్పేసింది. దీంతో చేసేది లేక ప్రియాంక తన స్పీచ్ ముగించకుండానే కిందకు వెళ్ళిపోయింది. తన ఫేస్ చూస్తే.. తనను అర్థంతరంగా ఎందుకు ఆపేశారనే ఓ రకమైన కన్ఫ్యూజన్ లో ఉంది.

ఒకవేళ అక్కడ ఉన్న జనాలు గోల చేస్తున్నా సుమ అలా చేసి ఉండాల్సింది కాదని.. ఫ్యాన్స్ విజయ్.. అల్లు అర్జున్ స్పీచ్ కోసం వేచి చూస్తున్నారని.. త్వరగా ముగించమని ప్రియాంక ను కోరి ఉండొచ్చని నెటిజనులు అంటున్నారు. అదే స్థానంలో కొత్త హీరోయిన్ కాకుండా సీనియర్ హీరోయిన్ ఉంటే సుమ అలానే చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.