Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : ట్యాక్సీవాలా బ్యూటీ టాలెంట్ చూపిస్తుంది..!

By:  Tupaki Desk   |   1 Nov 2022 2:30 AM GMT
ఫోటో స్టోరీ : ట్యాక్సీవాలా బ్యూటీ టాలెంట్ చూపిస్తుంది..!
X
ట్యాక్సీవాలా సినిమాతో రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ తో జోడీ కట్టిన భామ ప్రియాంకా జవల్కర్. తెలుగు అమ్మాయే అయినా తెల్లతోలు చూసి ఏ ముంబై నుంచి వచ్చిందో అనుకునేలా చేస్తుంది. ట్యాక్సీవాలా హిట్ తో కెరియర్ ఓ రేంజ్ లో దూసుకెల్తుంది అనుకుంటే రెండు మూడు సినిమాలకే చతికిలా పడ్డది. సత్యదేవ్ తో తిమ్మరుసు, కిరణ్ అబ్బవరం తో ఎస్.ఆర్ కళ్యాణమండపం మూవీస్ లో నటించిన ప్రియాంకా ఈ ఏడాది గమనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గ్లామర్ క్వీన్ గా ఉండే ప్రియాంకాని సరైన విధంగా తెర మీద చూపించడంలో విఫలమవుతున్నారు దర్శకులు. ట్యాక్సీవాలాలో కొద్దిగా పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ప్రియాంకా తెర మీద తేడాగా కనిపించింది. అందుకే అమ్మడికి సరైన ఫాలోయింగ్ ఏర్పడలేదు.. అవకాశాలు కూడా అందుకోలేదు.

అయితే సినిమాలు చేయకపోయినా అమ్మడు సోషల్ మీడియాని మాత్రం షేక్ చేస్తుంది. తన హాట్ ఫోజులతో తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది ప్రియాంకా జవల్కర్. లేటెస్ట్ గా ప్రియాంక తన షేపులతో కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టేస్తుంది.

అందగత్తె కానీ సరైన అవకాశాలు అందుకోని ప్రియాంకా మూవీ ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. తన ఫోటో షూట్స్ లో ప్రత్యేకంగా నడుము అందాలతో అమ్మడు కాక రేపుతుంది. లేటెస్ట్ ఫోటోలో కూడా నడుము సొగసులను చూపిస్తూ అలరిస్తుంది.

మరి కెరియర్ విషయంలో అమ్మడు ఏం థింక్ చేస్తుందో తెలియదు కానీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గుడ్ ఛాన్స్ అన్నట్టు కనిపిస్తుంది.

అమ్మడి ఫోటో షూట్స్ కి క్రేజీ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రియాంక ఇలా ఫోటో షే ర్ చేయడమే ఆలస్యం ఇలా వైరల్ చేసేస్తున్నారు నెటిజెన్లు. ప్రియాంకా గ్లామర్ షోని ఫాలోవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత చక్కనమ్మకి అవకాశాలు ఎందుకు రావట్లేదా అని అందరు డౌట్ పడుతున్నారు. మరి మళ్లీ వారిని అలరించేందుకు సిల్వర్ స్క్రీన్ పై ప్రియాంకా ఎప్పుడు మెరుస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.