Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లోకి వస్తున్న ప్రియాంక

By:  Tupaki Desk   |   12 April 2017 12:30 AM GMT
టాలీవుడ్ లోకి వస్తున్న ప్రియాంక
X
24 ఏళ్ల ప్రియాంక జవాల్కర్.. టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకునేందుకు వస్తున్న కొత్త హీరోయిన్. నాలుగేళ్ల క్రితమే షార్ట్ ఫిలిమ్ చేసిన ఈ భామ.. ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ ని ఫుల్ టైం ప్రొఫెషన్ గా తీసుకుని వచ్చేస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా.. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది ప్రియాంక జవాల్కర్.

అనంతపురంలో పెరిగిన మహరాష్ట్ర అమ్మాయి ప్రియాంక. ఫేస్ బుక్ ప్రొఫైల్ చూసి ఈమెతో షార్ట్ ఫిలిమ్స్ చేసేందుకు ముందుకొచ్చాయి నిర్మాణ సంస్థలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం టాలీవుడ్ లో వెలిగిపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తో షార్ట్ ఫిలిమ్స్ చేసిన సంస్థే.. ఈ ప్రియాంకతో కూడా అప్పట్లో యూట్యూబ్ మూవీస్ ని తెరకెక్కించింది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత.. హీరోయిన్ గా నటించాలంటూ దర్శకుడు రాహుల్ సాంక్రిత్యన్ నుంచి పిలుపు వచ్చిందట. అయితే.. ఆ సమయంలో యూఎస్ వెళ్లిపోతుండడంతో చేయలేకపోయానని చెప్పిన ప్రియాంక.. మళ్లీ ఇప్పుడు అదే దర్శకుడి సినిమాతో తెరంగేట్రం చేస్తూ.. అంతా విధి రాత అనేస్తోంది.

కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ విద్యను అభ్యసించిన ప్రియాంక జవాల్కర్.. ఫ్యాషన్ అండ్ క్లోతింగ్ లో డిప్లొమా కూడా చేసేసింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమాలో తనకు తనే స్టైలింగ్ చేసేసుకుంది ప్రియాంక. తను గతంలో షార్ట్ ఫిలిమ్స్ చేసినా.. ఫీచర్ ఫిలిమ్స్ చేయడం మాత్రం గొప్ప అనుభవం అంటున్న ప్రియాంక.. ఈ ఫీల్డ్ ను అర్ధం చేసుకునేందుకు విజయ్ దేవరకొండ బోలెడంత సాయం చేశాడని చెబుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/