Begin typing your search above and press return to search.

పిల్ల‌ న‌చ్చితే అంతే సంగ‌తి!

By:  Tupaki Desk   |   22 Nov 2018 6:04 AM GMT
పిల్ల‌ న‌చ్చితే అంతే సంగ‌తి!
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు తెలుగ‌మ్మాయిలు క‌రువైపోయారు! ఇది రెగ్యుల‌ర్‌గా వినిపించే సూటిపోటి విమ‌ర్శ‌నే. కానీ ఏం చేయ‌గ‌లం?.. ముంబై క్యాట్ వాక్ భామ‌ల్లో ఉన్న వేడి.... మ‌ల‌యాళీ క్యూటీల్లో ఉన్న పొగ‌రు ఒగ‌రు మ‌న‌మ్మాయిల్లో క‌నిపించ‌లేద‌న్న‌ది ద‌ర్శ‌క‌నిర్మాత‌ల కామెంట్‌. ఆ లెవ‌ల్లో హైద‌రాబాద్ - విజ‌య‌వాడ బ్యూటీస్ ఉంటే అవ‌కాశాలు ఎందుకు రావు అనేస్తుంటారు. ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో గమ్మ‌త్త‌యిన వ్య‌వ‌హారికాల్ని ఒంట‌పట్టించుకుంటే ఛాన్సులే ఛాన్సులు..అంటుంటారు.

బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ప్ర‌తిభ‌తో మెప్పించిన క‌ల‌ర్స్ స్వాతి - బ‌స్టాప్ శ్రీ‌దివ్య‌ - బిందు మాధ‌వి - అంజ‌లి - మాధ‌వీల‌త‌ - మ‌ధుశాలిని - అర్చ‌న - రీతు వ‌ర్మ‌ లాంటి సీనియ‌ర్ భామ‌లు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఉపాధి పొందారు. ఆ త‌ర్వాత అంత పెద్ద వేవ్ ఇటీవ‌ల క‌నిపించ‌లేదు. `అంత‌కుముందు ఆ త‌ర‌వాత` హిట్ కొట్టాక‌ ఇషారెబ్బా కెరీర్ లో జోరు క‌నిపించింది. వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ వేడి పెంచుతోంది ఈ హైద‌రాబాదీ బ్యూటీ. ఇటీవ‌లే ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత‌`లోనూ చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. మ‌రోవైపు పెళ్లి చూపులు బ్యూటీ రీతూవ‌ర్మ త‌మిళంలో బిజీ అయిపోయింది. రీతూ - ఇషా త‌ర్వాత అంత వేవ్‌ తో ఇంకెవ‌రూ తెలుగ‌మ్మాయిలు లేర‌నుకుంటే...అనంత‌పురం అమ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్ బ‌రిలోకి వ‌చ్చింది. ప్రియాంక న‌టించిన ట్యాక్సీవాలా పెద్ద హిట్టు. బ‌న్ని వీరాభిమానిని అని చెప్పుకున్న ఈ అమ్మాయికి మునుముందు ఎలాంటి అవ‌కాశాలొస్తాయో చూడాలి. ప్రియాంక జువాల్క‌ర్ లాంటి తెలుగ‌మ్మాయిల‌కు .. ప్ర‌తిభావంతుల‌కు అల్లు - మెగా కాంపౌండ్‌ లు స‌హా టాలీవుడ్ కాంపౌండ్‌ ల‌న్నీ బోలెడంత‌ సాయం చేస్తున్నాయి.

తెలుగ‌మ్మాయే అయినా ఎంక‌రేజ్ చేయాలంటే చాలానే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అనంత‌పురం అమ్మాయికి తొలి బ్లాక్‌ బ‌స్ట‌ర్ త‌గిలింది.. ఇక టాలీవుడ్‌ లో వ‌రుస ఛాన్సులు వ‌స్తాయ‌నే భావిద్దాం. మారుతున్న ట్రెండ్‌ లో రీతూవ‌ర్మ‌ - ఇషా రెబ్బా - ప్రియాంక స్ఫూర్తితో మ‌రింతమంది తెలుగ‌మ్మాయిలు టాలీవుడ్‌ లో ప్ర‌వేశిస్తారనడంలో సందేహం లేదు.