Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్‌ కనుక తీసేస్తారేమో అనుకున్నా..!

By:  Tupaki Desk   |   14 Nov 2018 1:41 PM GMT
గీతా ఆర్ట్స్‌ కనుక తీసేస్తారేమో అనుకున్నా..!
X
ఏ హీరో అయినా హీరోయిన్‌ అయిన టాలీవుడ్‌ లో పెద్ద బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌ లో సినిమా చేయాలని కోరుకుంటారు. గీతా ఆర్ట్స్‌ మూవీతో ఎంట్రీ ఇస్తే మంచి గుర్తింపు వస్తుందనేది అందరి అభిప్రాయం. తాజాగా గీతా ఆర్ట్స్‌ 2 ద్వారా పలువురు చిన్న హీరోయిన్స్‌ ను పరిచయం చేస్తున్నారు. తాజాగా ట్యాక్సీవాలా చిత్రంతో ప్రియాంక జవాల్కర్‌ ను హీరోయిన్‌ గా పరిచయం కాబోతుంది. ఈ చిత్రంతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్నా ఇప్పటిని నేను ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నాను అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

‘ట్యాక్సీవాలా’ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్‌ దేవరకొండ వంటి క్రేజ్‌ హీరోతో కలిసి యూవీ క్రియేషన్స్‌ మరియు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ లు నిర్మించిన మూవీలో అవకాశం రావడంతో చాలా సంతోషంగా ఉంది. షార్ట్‌ ఫిల్మ్‌ లో నటించిన నేను భిక్షు - ఆయన భార్య దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆ సమయంలోనే నేను గీతా ఆర్ట్స్‌ కు నా ఫొటోలు పంపించడం జరిగింది. ఆ ఫొటోలు పంపిన నాలుగు నెలల తర్వాత నాకు గీతా ఆర్ట్స్‌ నుండి పిలుపు వచ్చింది. ఆ పిలుపుతో నేను చాలా ఆశ్చర్య పోయాను. పెద్ద బ్యానర్‌ కనుక కొన్ని రోజులు చూసి నన్ను తీసేస్తారేమో, నా నటన వారికి నచ్చుతుందో లేదో అనే అనుమానం నాకు ఉండేది. అందుకే ట్యాక్సీవాలా చిత్రం షూటింగ్‌ కొన్ని రోజులు అయ్యే వరకు ఎవరికి చెప్పలేదు. షూటింగ్‌ రెండు మూడు వారాలు చేసిన తర్వాత ఇక తీసేయరులే అనే నమ్మకం వచ్చిన తర్వాత నేను ఇంట్లో వారికి మరియు అందరికి చెప్పుకున్నాను అంటూ ప్రియాంక జవాల్కర్‌ పేర్కొంది. ఈ చిత్రంతో ప్రియాంకకు మంచి గుర్తింపు వస్తుందేమో చూడాలి.