Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : రౌడీ బ్యూటీ కిల్లింగ్ చూపులు

By:  Tupaki Desk   |   20 May 2021 7:30 AM GMT
ఫొటోటాక్‌ : రౌడీ బ్యూటీ కిల్లింగ్ చూపులు
X
అనంతపురం బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటించిన ట్యాక్సీ వాలా సినిమాతో వచ్చింది. సినిమా లో ఆమె లుక్ మరియు నటనకు మంచి పేరు అయితే వచ్చింది కాని లక్‌ కలిసి వచ్చినట్లుగా లేదు. దాంతో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

ట్యాక్సీవాలా సినిమా వచ్చి మూడు ఏళ్లు దాటి పోతుంది. అయినా కూడా ఈమె కు ఇబ్బడి ముబ్బడిగా అన్నట్లుగా ఆఫర్లు రావడం లేదు. తెలుగు లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య అంతంత మాత్రమే. కొన్ని వెబ్‌ సిరీస్ ల కోసం ఈమెను సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకు వెనుకాడుతారనే అభిప్రాయం ఉంది. కాని ప్రియాంక జవాల్కర్ మాత్రం ఆ విషయంలో హద్దులు చెరిపేసింది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా హాట్‌ పొటో షూట్‌ లతో రెచ్చి పోతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటో అందరిని ఆకట్టుకుంటుంది.

మినీ స్కట్‌ వేసి నడుము మరియు థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ మత్తు కల్లతో ఆమె చూపు ప్రతి ఒక్క కుర్రకారు గుండెకు గుచ్చుకుంటుంది. అందాల ఆరబోతలో ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గని ఈ అమ్మడికి ఆఫర్లు ఎందుకు ఆశించిన స్థాయిలో రావడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.