Begin typing your search above and press return to search.

#లేజీ డే.. తెలుగ‌మ్మాయ్ ఇన్ స్టా ఓపెన్ చేస్తే మైండ్ బ్లాక్!

By:  Tupaki Desk   |   16 April 2021 12:30 PM GMT
#లేజీ డే.. తెలుగ‌మ్మాయ్ ఇన్ స్టా ఓపెన్ చేస్తే మైండ్ బ్లాక్!
X
తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగ‌మ్మాయిల‌కు అవ‌కాశాలివ్వ‌రు! అన్న‌ది పాత మాట‌. ఇటీవ‌ల తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో తెలుగ‌మ్మాయిల హ‌వా అంత‌కంత‌కు పెరుగుతోంది. అంజ‌లి- ఇషారెబ్బా-అన‌సూయ‌- రేష్మి- చాందిని చౌద‌రి- ఫ‌రియా అబ్దుల్లా .. ఇలా డ‌జ‌ను మంది వ‌ర‌కూ తెలుగుమ్మాయిలు తెలుగు పరిశ్ర‌మ‌లో రాణిస్తున్నారు.

ఇదే కోవ‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతోంది అనంత‌పురం అమ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్. 2017లో క‌ల‌వ‌ర‌మాయే అనే చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న టాక్సీవాలా చిత్రంలో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఈ సినిమాలో ప్రియాంక అద్భుత న‌ట‌న‌కు యూత్ ఫిదా అయిపోయారు. ఆ సినిమా త‌ర్వాత కూడా ప్రియాంక‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్ఆయి.

టాక్సీవాలా త‌ర్వాత‌ బ‌న్ని సినిమాలోనే అవ‌కాశం ఇస్తున్నార‌ని ప్ర‌చార‌మైనా దానికి సంబంధించిన అప్ డేట్ రాలేదు. ప్రియాంక ఎస్.ఆర్ క‌ళ్యాణ‌మంట‌పం అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాల్లో ప్రియాంక లేటెస్ట్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు అంటూ చీర‌క‌ట్టులో ఎంతో ట్రెడిష‌న‌ల్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకొచ్చిన ప్రియాంక‌.. తాజాగా ప్రియాంక స్పోర్ట్ లుక్ యూత్ లో సంచ‌ల‌నంగా మారింది. ఇత‌ర నాయిక‌ల్లానే ఫిట్నెస్ పై పూర్తి అవ‌గాహ‌న‌తో ఉంది ఈ తెలుగ‌మ్మాయి. ప్రియాంక రెగ్యుల‌ర్ ఫిట్నెస్ ఫ్రీక్ అని తాజా ఫోటోలు చెబుతున్నాయి. లేజీగా..! అంటూ ఈ ఫోటోల‌కు ప్రియాంక జ‌వాల్క‌ర్ క్యాప్ష‌న్ ఇచ్చారు.