Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : రెడ్ హాట్ లో పేలిన‌ సీమ ట‌పాకాయ్?

By:  Tupaki Desk   |   19 May 2022 4:30 PM GMT
ఫోటోటాక్ : రెడ్ హాట్ లో పేలిన‌ సీమ ట‌పాకాయ్?
X
ప్రియాంక జవాల్కర్ పరిచయం అవసరం లేదు. `ట్యాక్సీవాలా` సినిమాతో గమ్మత్తయిన హిట్ అందుకుని అటుపై కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకు తగ్గట్టే నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానుల్ని యంగేజ్ చేస్తోంది. ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటుంది.

తాజాగా అమ్మ‌డు కొత్త ఫోటో ఒక‌టి షేర్ చేసింది. అందులో సీమ పిల్ల సీమ ట‌పాకాయ్ లా పేలింది. రెడ్ క‌ల‌ర్ బ్లౌజ్..మ్యాచింగ్ స్క‌ర్ట్ లో సెగ‌లు రేపుతుంది. కిల్ల‌ర్ లుక్ లో కుర్రాళంతా అలా లాక్ అవ్వాల్సిందే అన్న రీతున చూపుల‌తో సోయ లేకుండా చేస్తుంది. నాజుకైన శ‌రీర సౌంద‌ర్యం లో మ‌నోహ‌రంగా క‌నిపిస్తుంది.

ప్రియాంక లుక్ లో మార్పులు గ‌మ‌నించ‌వ‌చ్చు. కాస్త చ‌బ్బీ లుక్ లో క‌నిపించే అమ్మ‌డు ఇప్పుడు స‌న్న‌బ‌డింది. ప్యాట్ మొత్తం తొల‌గించి ప‌ర్పెక్ట్ లుక్ లో ఆక‌ట్టుకుంటుంది. గ్లామరస్ హీరోయిన్ గా ఒక ముంబై డాళ్ కి తగ్గని వయ్యారం తన సొంతం అని ప్రూవ్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్రియాంక అభిమానులు ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇటీవల ప్రియాంక వరుస చిత్రాలతో తెలుగు ఆడియెన్ ని పలకరించింది. `తిమ్మరుసు` సినిమా పాజిటివ్ సమీక్షలు అందుకున్నా కానీ ఆశించిన రేంజును అందుకోలేకపోయింది. సత్యదేవ్ సరసన ప్రియాంక నటనకు గుర్తింపు దక్కింది.
మరో సినిమా `ఎస్.ఆర్ కళ్యాణ మండపం` ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన కామెడీ లవ్ ఎంటర్ టైనర్ గా ఇది నిలిచింది. ప్రస్తుతం సుజన్ రావు అనే కొత్త దర్శకులు తెరకెక్కిస్తున్న `గమనం` అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా తనకు పేరు తెస్తుందని నమ్ముతోంది. కొత్త అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నాలు సీరియ‌స్ గానే కొన‌సాస్తుంది. అయితే స‌రైన స్టార్ తో న‌టించే ఛాన్స్ మాత్రం ఇంకా ద‌క్క‌లేదు. అలాంటి ట‌ర్నింగ్ కోసం వెయిట్ చేస్తోంది.