Begin typing your search above and press return to search.

విజయ్ హీరోయిన్ కు కలిసొచ్చిందిగా

By:  Tupaki Desk   |   1 March 2018 4:53 AM GMT
విజయ్ హీరోయిన్ కు కలిసొచ్చిందిగా
X
సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త అందాలకు తలుపులు తెరిచే ఉంచుతుంది. ముఖంలో కాస్త గ్రేస్.. కవ్వించే స్ట్రక్చర్.. కాస్తో కూస్తో నటించగలదు అనుకుంటే ఎక్కడెక్కడి నుంచో హీరోయిన్ లను వెతికి తెచ్చుకుంటారు. ఇది ఒక్క టాలీవుడ్ కే కాదు.. సౌత్ అన్ని భాషల్లోనూ ఉన్న ట్రెండే. అందుకే తెలుగు తెరకు పరిచయం అవబోతున్న యంగ్ బ్యూటీకి అప్పుడే శాండల్ వుడ్ స్వాగతం చెప్పేసింది.

అర్జున్ రెడ్డి లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ తరవాత హీరోగా నటిస్త్తున్న సినిమా టాక్సీవాలా. ఇందులో హీరోయిన్ గా మహారాష్ట్ర అమ్మాయి ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈలోగా ఈ భామ కన్నడలో స్టార్ హీరోయిన్ పక్కన నటించే అవకాశం కొట్టేసింది. ఆ భాషలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా పవన్ వడియార్ డైరెక్ట్ చేయబోయే సైంటిఫిక్ థ్రిల్లర్ కోసం ఓ ఫ్రెష్ ఫేస్ కోసం వెతుకుతున్నారు. బోలెడుమందిని పరిశీలించాక చివరకు ప్రియాంక యే ఈ రోల్ కు పర్ ఫెక్ట్ గా సూటవుతుందని డిసైడై ఆమెను ఎంపిక చేశారు.

మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఇంకో బ్రహ్మాండమైన ఆఫర్ తలుపు తట్టడంతో ప్రియాంక ఉబ్బితబ్బిబ్బవుతోంది. ప్రియాంక బేసిగ్గా మరాఠా అమ్మాయి అయినా తను పుట్టిపెరిగింది రాయలసీమలోని అనంతపురంలోనే. తెలుగు చక్కగా మాట్లాడటం ఈ బ్యూటీకున్న ఇంకో ప్లస్ పాయింట్. పరశురాం డైరెక్షన్ లో వస్తున్న టాక్సీవాలా రిలీజు తరవాత మరిన్ని ఛాన్సులు దక్కించుకోగలననే నమ్మకంతో ఉంది ప్రియాంక.