Begin typing your search above and press return to search.

బాల‌య్య స‌ర‌స‌న సీమ పిల్ల సెకెండ్ లీడ్!

By:  Tupaki Desk   |   10 March 2023 1:30 PM IST
బాల‌య్య స‌ర‌స‌న సీమ పిల్ల సెకెండ్ లీడ్!
X
అనంత‌పురం బ్యూటీ ప్రియాంక జ‌వాల్క‌ర్ సుప‌రిచిత‌మే. 'టాక్సీవాలా'తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు తొలి సినిమాతో స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది. సీమ పిల్ల బ్యూటీకి కుర్ర‌కారు ఫిదా అయ్యారు. సిగ్గులొలికే న‌వ్వు..హాట్ హాట్ ఫోజులో కుర్రాళ్ల‌ను అట్రాక్ట్ చేసింది. అటుపై 'తిమ్మ‌ర‌సు'..'ఎస్. ఆర్ క‌ళ్యాణ మండ‌పం'..'గ‌మ‌నం' లాంటి చిత్రాల్లో న‌టించింది. 'క‌ళ్యాణ మండ‌పం' బాగానే ఆడింది.

కానీ ప్రియాంక అంత బిజీ స్టార్ కాలేక‌పోయింది. గ‌తేడాది ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. 'గ‌మ‌నం' త‌ర్వాత బ్యూటీ జాడే లేదు. సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా యాక్టివ్ గా క‌నిపించ‌లేదు. దీంతో సీమ పిల్ల ఏమైపోయిందంటూ ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ లో చ‌ర్చ‌కొచ్చింది. ఇలా డిస్క‌ష‌న్ కి వ‌చ్చిందో ? లేదా? అలా బాల‌య్య 108వ సినిమాలో ఛాన్స్ అందుకుంది.

బాల‌య్య క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే కొత్త‌ షెడ్యూల్ ప్రారంభ‌మైంది. ఇంకా బాల‌య్య‌కి హీరోయిన్ ని ఎంపిక చేయ‌లేదు. కొంత మంది భామ‌ల ప‌రిశీల‌న అనంత‌రం కాజ‌ల్ అగ‌ర్వాల్ ని తీసుకుంటున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. అయితే ప్రియాంక‌కు ఇదే సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఇందులో అమ్మ‌డు సెకెండ్ లీడ్ పోషిస్తున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. ఇదే నిజ‌మైతే సీమ పిల్ల‌కి బాల‌య్య ఊపిరిపోసినట్లే. ఇప్ప‌టికే అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటుంది. టైర్ -2 హీరోలెవ‌రు ఆమెవైపు చూడ‌టం లేదు. యంగ్ హీరోలు కూడా కొత్త భామ‌ల‌కే మొగ్గు చూపుతున్నారు త‌ప్ప‌! చిన్నా ..చిత‌కా స‌క్సెస్ లున్న వాళ్ల వైపు క‌నీసం లుక్ కూడా వేడ‌యం లేదు.

కానీ బాల‌య్య మాత్రం మంచి మ‌న‌సుతో సీప పిల్ల‌కి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. అవ‌కాశాలు లేని హీరోయిన్ల‌ని ప్రోత్స‌హించ‌డంలో ముందుంటారు . అప్ప‌ట్లో సోనాల్ చౌహాన్..అంజ‌లి లాంటి వారిని అవ‌కాశాలు లేని స‌మ‌యంలో ఆదుకున్న సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.