Begin typing your search above and press return to search.

పరిటాల హత్యగురించి ప్రియాంక జవాల్కర్ ఏమంటోంది?

By:  Tupaki Desk   |   15 Nov 2018 4:36 AM GMT
పరిటాల హత్యగురించి ప్రియాంక జవాల్కర్ ఏమంటోంది?
X
చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక తెలుగు హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రియాంక జవాల్కర్ మరాఠీ అమ్మాయే అయినా కేరాఫ్ అనంతపూర్ కావడంతో మన తెలుగు అమ్మాయేనని ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే సర్టిఫికేట్ ఇచ్చేశాడు కాబట్టి మనం కూడా అదే ఫిక్స్ అయిపోవచ్చు. విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరో.. గీతా ఆర్ట్స్ - యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో తెరకెక్కిన సినిమాతో ఎంట్రీ ఇస్తోంది కాబట్టి హీరోయిన్ వెంటనే గుర్తింపు వచ్చింది. ఇప్పటికే సహజత్వం కోసం కాస్త మందుకొట్టానని షాకిచ్చిన ఈ అనంతపూర్ భామ తాజాగా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషనల్ విషయాలు మాట్లాడిందట.

ఐ5 అనే ఈ యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో ఈమధ్యనే రిలీజ్ అయింది. అందులో విజయ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ఎలా ఉంది అంటే.. 'పెళ్ళిచూపులు' సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమాకు సైన్ చేశానని తెలిపింది. మీరు క్యాబ్ ఎక్కడ బుక్ చేస్తే అక్కడికి వచ్చి పిక్ చేసుకోవాలంట అని అడిగితే.. "అప్పుడు నేను తాగున్నాను. ఏదైనా మాట్లాడతా.. నా ఇష్టం. తాగి ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకూడదు" అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది.

మరో ప్రశ్నకు "ప్రతి ఒక్క నటి తన ప్రత్యేకతను సినిమాలో తను పోషించే క్యారెక్టర్ కు జోడిస్తుంది.. ఇప్పుడు నిత్య మీనన్ చేసినట్టు.. రకుల్ చేసినట్టు నేను చేయలేను" అని చెప్పింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ ఈజ్ ఫరెవర్ ఎ హీరో' అనిచేప్పింది. సెట్స్ లో పెగ్గేయడం గురించి అడిగితే "ఓ త్రీ ఫోర్ డేస్.. సెట్టుకెళ్ళడం వోడ్కాలో మినిట్ మెయిడ్ వేసి ఇస్తారు.. వ్యానిటీ వ్యాన్లో తాగడం పని" అని చెప్పింది.

అనంతపూర్ అంటే ఫ్యాక్షనిజం.. అని అడిగితే "అందరూ అదే అనుకుంటారు." అని చెప్పింది. ఎప్పుడైనా ఫ్యాక్షన్ గొడవల్లాంటివి చూడడం జరిగిందా అని అడిగితే.. "నేను మరిచిపోలేని సంఘటన పరిటాల రవిగారి హత్య.. " అని చెప్పింది. ఈ విషయం చెప్పే సమయంలో కాస్త ఎమోషనల్ అయింది. ఇక ఫుల్ ఇంటర్వ్యూ చూడడానికి యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళాల్సిందే. అంతలోపు ఈ స్ట్రాంగ్ ప్రోమో వీడియోపై ఒక లుక్కేయండి.