Begin typing your search above and press return to search.

మోదుగు మొగ్గలాంటి అమ్మాయికి ఛాన్సులేవీ?

By:  Tupaki Desk   |   15 March 2021 6:30 AM GMT
మోదుగు మొగ్గలాంటి అమ్మాయికి ఛాన్సులేవీ?
X
తెరపై అన్ని సమస్యలను హీరోనే పరిష్కరిస్తూ ఉంటాడు .. చెడు చేసేవాళ్లను చెడుగుడు ఆడేస్తుంటాడు. విలన్ ఎంత బలవంతుడైనా తానే విన్ అవుతాడు. మరి అన్నీ హీరోనే చేసేటప్పుడు హీరోయిన్ ఎందుకు? అనే ఆలోచన రావడం సహజం. అలాంటి ఆలోచన వచ్చే కొంతమంది హీరోయిన్ లేకుండా సినిమాలు చేసి దెబ్బతిన్నారు. హీరోయిన్ లేని తెర .. కలువలు లేని సరస్సులా కనిపిస్తుంది. ఒయాసిస్సులు లేని ఎడారిలా అనిపిస్తుంది. కథలో ఎన్నో కష్టాలు ఉన్నా కథానాయకుడితో సహా, థియేటర్లలోని ప్రేక్షకులు కూడా వాటిని మరిచిపోయేలా చేసేది హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే గ్లామర్ హీరోయిన్లను దర్శక నిర్మాతలు వెతికి మరీ పట్టుకుంటారు. అందంగా ఉన్న అమ్మాయిలకు తెలుగు తెర ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. అలాంటి అమ్మాయిల పాదాల క్రింద కుర్రాళ్లు పడుచుమనసులను పరుస్తూనే ఉంటారు. అలాంటి కుర్రాళ్ల హృదయాలను హోల్ సేల్ గా దోచేసిన హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ కనిపిస్తుంది. 'టాక్సీవాలా' సినిమాలో తెరపై మోదుగు మొగ్గలా కనిపించిన ఈ అమ్మాయి, పిల్లగాళ్ల మనసులపై ఫిడేలు రాగాలు పలికించింది. చక్కని స్కిన్ టోన్ తో .. విచ్చుకున్న పెదాలతో .. గుచ్చుకునే చూపులతో కట్టిపడేసింది.

తపోభంగం చేయడానికి భూలోకానికి వచ్చిన అప్సరసలా ఉన్న ఈ అమ్మాయిని చూసి మనసు పారేసుకోని యువకుల్స్ లేకుండా పోయారు. ఇక ఇక్కడ ఈ సుందరి ఒక రేంజ్ లో దున్నేస్తుందని అనుకున్నారు. కానీ అనుకున్నవన్నీ అవుతాయా? అన్నట్టుగా ఈ పిల్ల తన చురుకుదనాన్ని చూపించలేదు. సినిమాకి .. సినిమాకి మధ్య దూరం ఉండాలనుకుందేమో, తన తరువాత వస్తున్న హీరోయిన్లకు ఇబ్బంది కలగకుండా దారిస్తూ కూర్చుంది. 'గమనం' సినిమాను చేసి .. దాని విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఇంత అందం పెట్టుకుని ఇంత నిదానమైతే కష్టమేనని అభిమానులు అంటున్నారు. "ఆ పిల్లంటే మొహమాట పడుతోంది .. మీరైనా కాస్త చూసుకోండి" అంటూ దర్శక నిర్మాతలకు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు.