Begin typing your search above and press return to search.

ఇది అసలు సిసలైన గాళ్ పవర్

By:  Tupaki Desk   |   7 May 2018 10:00 AM IST
ఇది అసలు సిసలైన గాళ్ పవర్
X
మహిళా శక్తి.. మహిళా సాధికారికత.. ఉమన్ పవర్.. లాంటి పదాలు వింటూనే ఉంటాం. వాస్తవంలో దీన్ని పవర్ ఏంటో చూసే అవకాశం ఎక్కువసార్లు లభించదు. కానీ ఇప్పుడు మహానటి మూవీ విషయంలో నిజమైన మహిళా శక్తిని చూడబోతున్నామని అనిపిస్తోంది.

ఈ చిత్రంపై ఆసక్తి పెరగడానికి తొలి కారణం.. స్టార్ హీరోయిన్ సమంత. సామ్ ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసిన తర్వాత.. అది కూడా ఓ క్యారెక్టర్ మాత్రమే చేస్తోందని తెలిశాక.. చాలామంది షాక్ తిన్నారు. ఆ తర్వాత అట్రాక్టివ్ పాయింట్ కీర్తి సురేష్. మలయాళీ ముద్దుగుమ్మను తీసుకొచ్చి.. ఎప్పటికీ టాలీవుడ్ మహానటి అయిన సావిత్రి పాత్రలో నటింపచేయడం కొందరికి నచ్చలేదు. కానీ మహానటి పాత్రలో కీర్తి ఎంతగా ఒదిగిపోయిందో చెప్పేందుకు.. రీసెంట్ గా బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు చాలు. ప్రతీ యాంగిల్ లోను సావిత్రిని గుర్తు చేసేసిందంటే.. ఆమె ట్యాలెంట్ అర్ధమవుతుంది.

ఇక వీరికంటే ముందు.. ఈ ప్రాజెక్టును నమ్మిన మహిళ ప్రియాంక దత్. ఈ చిత్రానికి నిర్మాత ఆమె. తన భర్త నాగ్ అశ్విన్ ఈ కథ చెప్పినపుడు నమ్మడమే కాదు.. తన చెల్లి స్వప్న దత్ తో కలసి ఈ ప్రాజెక్టును సుసాధ్యం చేసింది కూడా. ఇక ఈ చిత్రానికి వర్క్ చేసిన టెక్నికల్ టీంలో 21మంది మహిళలు ఉన్నారంటూ.. ఆడియో ఫంక్షన్ సందర్భంగా నాగార్జున చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మొత్తంగా చూస్తే.. స్వప్న దత్.. కీర్తి సురేష్ లతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. గాళ్ పవర్ అని సమంత ట్వీట్ చేయడం కరెక్టే అనిపించక మానదు.