Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ ముక్కు కట్ చేయించిందా?

By:  Tupaki Desk   |   10 Jun 2017 6:49 PM GMT
ఆ హీరోయిన్ ముక్కు కట్ చేయించిందా?
X
బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ ప్లాస్టిక్ సర్జరి చేసుకొని సక్సెస్ అయిన హీరోయిన్లు అతి కొద్ది మందే ఉన్నారు. మొదట్లో వాళ్ళ టాలెంట్ తో వచ్చి ఒక స్టేటస్ వచ్చాక ఏమి అనుకుంటారో కానీ వాళ్ళ ముక్కును మొఖాన్ని కొంత మంది మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. ప్లాస్టిక్ సర్జరి చేసుకొని వాళ్ళ అందాన్ని పాడు చేసుకున్న స్టార్స్ చాలా మందే ఉన్నారు.

ఉదాహరణకు విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మా లిప్ సర్జరి చేసుకొని అందరి ముందు నవ్వులు పాలులైంది. అలానే పేరు మోసిన మోడల్ కోయినా మిత్ర కూడ దారుణంగా విఫలం అయ్యింది ఆ తరువాత కెరియర్ కూడ వదులుకోవలిసి వచ్చింది. ఇప్పుడు హాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడ ముక్కు పై ఏదో కొత్తదనం కోసం ప్లాస్టిక్ సర్జరి చేసుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక బాలీవుడ్ ప్రాజెక్టు కోసం ముంబయ్ వచ్చిన ఈ బ్యూటీ ఒక సెల్ఫి ఫోటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను అందరూ ఒకరకంగా పరీక్షించి చూసి ముక్కు దగ్గర తేడాను ఇటే గుర్తు పట్టేసి.. ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమె అందం మార్చుకోవాల్సినంత తక్కువ అందమేమి కాదుకదా.. మరి నిజంగానే సర్జరీ చేయించుకుంది అంటారా?

ఈ యవ్వారంపై నెటిజన్ల కామెంట్లను పరిశీలిస్తే.. “ప్రియాంకా చూడటానికి కొత్తగా ఉన్నా తన అందం పాడుచేసుకొంది” అని, “కోయినా మిత్ర లాగా ప్రియాంకా కెరియర్ కూడ తప్పుదోవ పడుతుంది” అని కొందరు “ప్లాస్టిక్ 2 రూపీ గ్రామ్స్ ప్లీజ్” అని మరొకరు కామెంట్లు చేశారు. ప్రియాంకా అయితే వీటిని పట్టించుకునే పని ఏమి పెట్టుకోలేదు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/