Begin typing your search above and press return to search.

ప్రియాంక పెళ్లి ఆ రోజేనా?

By:  Tupaki Desk   |   31 July 2018 7:25 AM GMT
ప్రియాంక పెళ్లి ఆ రోజేనా?
X
ప్రియాంక చోప్రా నిశ్చితార్థం గురించి కొన్ని రోజుల కిందట వార్తలొస్తే.. అవి కేవలం రూమర్లే అనుకున్నారు చాలామంది. తన కంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ప్రియాంక కొన్ని నెలల నుంచే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నప్పటికీ.. నిజంగా అతడితో ఎంగేజ్ అవుతుందా అనే విషయంలో సందేహాలున్నాయి. కానీ ఆమె నిజంగానే నిక్ తో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. చడీచప్పుడు లేకుండా ఈ తంతు ముగిసిపోయింది. ఇక పెళ్లి విషయంలో కూడా ప్రియాంక ఆగేట్లేమీ కనిపించడం లేదు. పెళ్లికి ఆల్రెడీ ముహూర్తం కూడా కుదిరినట్లు వార్తలొస్తున్నాయి. సెప్టెంబరు 16న ప్రియాంక పెళ్లి అమెరికాలో జరుగుతుందని అక్కడి మీడియా కథనాలు వెలువరిస్తోంది.

సెప్టెంబరు 16వ తేదీకి ప్రత్యేకత లేకపోలేదు. ఆ రోజు నిక్ పుట్టిన రోజు. అదే రోజు ప్రియాంకను పెళ్లి చేసుకోవడానికి అతను రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రియాంక వయసు 36 ఏళ్లు కాగా.. సెప్టెంబరు 16తో 26వ ఏట అడుగుపెడతాడు నిక్. వీళ్లిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి పూర్తి ఆమోదం ఉన్నట్లు సమాచారం. కొన్ని నెలల కిందటే నిక్.. ప్రియాంకతో కలిసి ఇండియాకు వచ్చాడు. ఆమె కుటుంబంతో కలిశాడు. అంతకంటే ముందే ప్రియాంక నిక్ కుటుంబ సభ్యుల్ని ఒక పార్టీలో కలుసుకుంది. నిశ్చితార్థంలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. నిక్ తో పెళ్లి కోసమే సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సరసన ‘భరత్’ లాంటి భారీ సినిమాను కూడా వదులుకుంది ప్రియాంక. ఇక ఆమె బాలీవుడ్ సినిమాల్లో నటించడం దాదాపు కష్టమే అంటున్నారు. పెళ్లి తర్వాత ఆమె అమెరికాలోనే సెటిలయ్యే అవకాశముంది.