Begin typing your search above and press return to search.

ఇంజ‌నీర్ అవుదామ‌నుకున్నా.. స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   31 Jan 2021 6:00 PM IST
ఇంజ‌నీర్ అవుదామ‌నుకున్నా.. స్టార్ హీరోయిన్
X
డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యాను చాలా మంది చెబుతుంటారు. అయితే.. తాను మాత్రం భావి భార‌తాన్ని ‘నిర్మించే’ ఇంజ‌నీర్ ను కావాల‌నుకున్నాను అంటోంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆమె.. త‌న సినీరంగం ఎంట్రీ గురించి కూడా వెల్ల‌డించింది.

లేటెస్ట్ గా విడుదలైన ‘వైట్ టైగర్’ సినిమాతో మరో సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకుంది స్టార్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇటు బాలీవుడ్‏లోనే కాకుండా.. హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ.. స‌క్సెస్ జోరు కంటిన్యూ చేస్తోంది. అంతేకాదు.. గ్లోబల్ స్టార్‏ రేసులో దూసుకుపోతుందీ బ్యూటీ. తాజాగా.. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆసక్తికర విషయాలను వెల్ల‌డించింది ప్రియాంక.

2000 సంవ‌త్స‌రం నిర్వ‌హించిన‌ అందాల పోటీలో పాల్గొని గెలిచి, కిరీటాన్ని సొంతం చేసుకున్నానని చెప్పింది ప్రింయాక‌. అదే సమయంలో బాలీవుడ్ నుంచి చాలా సినిమా అవకాశాలు వచ్చాయని తెలిపింది. అయితే.. అప్పటికీ సినిమాల గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పింది. ఈ క్ర‌మంలోనే త‌న అడుగులు సినీరంగం వైపు న‌డిచాయ‌ని తెలిపిందీ బ్యూటీ. నటనకు సంబంధించిన విషయాలన్నింటినీ షూటింగ్‌ జరుగుతుండగానే నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.

అలా సినీ ఇండస్ట్రీలోకి ప్ర‌వేశించిన తానున అక్క‌డే ఉండిపోయానని చెప్పింది ప్రియాంక‌. తనకు ఈ పరిశ్రమ సెట్ అయిందని తెలిపింది. అయితే.. మొద‌ట్లో తాను ఇంజినీర్ కావాలనుకున్నానని తెలిపింది. కానీ.. అనుకోకుండా మొద‌లైన ఈ సినీ జ‌ర్నీ అలా కంటిన్యూ అవుతోంద‌ని చెప్పుకొచ్చింది ప్రియాంక‌. ఇక, లాక్ డౌన్ తర్వాత షూటింగ్ లో పాల్గొన‌డం ఎలా అనిపిస్తోంద‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నాను. అయిన‌ప్ప‌టికీ.. సెట్‏లో అంత‌ సేఫ్‏గా అనిపించట్లేద‌ని చెప్పుకొచ్చింది ప్రియాంక.