Begin typing your search above and press return to search.
జాగ్రత్తలు తీసుకున్నా సేఫ్ అనిపించలేదు
By: Tupaki Desk | 1 Feb 2021 2:00 PM ISTబాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో మరియు వెబ్ సిరీస్ ల్లో వరుసగా నటిస్తూ గ్లోబల్ స్టార్ గా కూడా పేరు దక్కించుకుంది. ఈ అమ్మడు ఇటీవల నటించిన 'వైట్ టైగర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ఈమెకు మంచి పేరు తెచ్చింది. దాంతో మరోసారి ఈమె స్టార్ డంను చాటుకుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంజనీర్ కావాలనుకున్న తాను అనుకోకుండా 2000 సంవత్సరంలో జరిగిన అందాల పోటీల్లో విజేతగా నిలిచాను. ఆ సమయంలో నాకు పెద్ద ఎత్తున సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కాని ఆ సమయంలో నాకు నటన గురించి ఎక్కువగా తెలియదు. నేను సినిమాలు చేస్తున్న సమయంలోనే నటన గురించి పాఠాలు నేర్చుకున్నాను. సినిమాల్లో నటిస్తూనే చాలా విషయాలపై పరిజ్ఞానం పొందాను అంది. ఇక లాక్ డౌన్ తర్వాత షూటింగ్ లకు హాజరు అయిన సమయంలో కాస్త టెన్షన్ పడ్డాను. కరోనా జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నా కూడా ఎక్కడో ఏదో అనుమానం ఉండేది. అంతా సేఫ్ గా అనిపించేది కాదని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ టెన్షన్ ఏమీ లేదని అలవాటుగా షూటింగ్ లకు జాగ్రత్తలతో వెళ్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.