Begin typing your search above and press return to search.

భ‌ర్త స్పేస్ లో ఒంట‌రివాడ‌య్యాడ‌ని పీసీలో నిర్వేదం!

By:  Tupaki Desk   |   13 March 2021 11:30 AM GMT
భ‌ర్త స్పేస్ లో ఒంట‌రివాడ‌య్యాడ‌ని పీసీలో నిర్వేదం!
X
అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రాలో ఆ నిర్వేదం ఏమిటో..! భ‌ర్త స్పేస్ లో త‌ప్పిపోయాడ‌నే ఈ నిర్వేద‌మా.. అంటే? అదేమో కానీ.. తాజాగా లాంచ్ అయిన `స్పేస్ మ్యాన్` ఆల్బ‌మ్ లో నిక్ ల‌వ్ పీసీని ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసింది. సాంగ్ లాంచ్ అనంత‌రం పీసీ త‌న భ‌ర్త నిక్ జోనాస్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. `స్పేస్ మాన్` పాట (ఆల్బ‌మ్)లో త‌నపై భ‌ర్త నిక్ జోనాస్ అప‌రిమిత‌మైన ప్రేమ‌ను కురిపించినందుకు పీసీ ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతోంది. అంతేకాదు.. ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌కుండా ఆగ‌లేక‌పోయింది. ``మీరు మీ ప్రేమను నిరంతరం నాపై అప‌ర‌మితంగా చూపినందుకు నేను చాలా కృతజ్ఞురాలి`` అంటూ ఎమోష‌న్ కి గురైంది.

నిక్ జోనాస్ ను స్పేస్ మ్యాన్ ఆల్బమ్ లాంచింగ్ వేడుక‌లో త‌న భార్య స్ఫూర్తితోనే ఈ ఆల్బ‌మ్ ని రూపొందించాన‌ని ప్ర‌క‌టించారు. తనపై ఉన్న అపార‌మైన‌ ప్రేమకు ఆమె అతనికి కృతజ్ఞతలు తెలిపింది.

వీడియో లాంచ్ నుండి కొన్ని ఫోటోల్ని షేర్ చేసిన పీసీ భ‌ర్త నిక్ కి అభినందనలు తెలిపారు. నిక్.. ఇది మీకు ఎంత వ్యక్తిగతమో నాకు తెలుసు. మీరు మీ ప్రేమను నిరంతరం అప‌రిమితంగా కురిపించారు అని ఉద్వేగానికి లోనైంది.

# స్పేస్ మాన్ ఆల్బ‌మ్ లో థీమ్ ఆస‌క్తిక‌రం. ఒంట‌రివాడైన యువ‌కుడు నిక్ త‌న ప్రేయ‌సిపై ప్ర‌ణ‌యాన్ని విర‌హాన్ని వ్య‌క్త‌ప‌రుస్తూ ఈ పాట‌ను రూపొందించారు. స్పేస్ మ్యాన్ ఆల్బ‌మ్ లో పీసీ హోలోగ్రామ్ విజువ‌ల్ త‌ర‌హాలో క‌నిపిస్తుంది.

తాజాగా ఆల్బ‌మ్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా.. పీసీ రెడ్ హాట్ లుక్ ఒక‌టి రివీలైంది. ఈ డ్రెస్ అత్యంత ఖ‌రీదైన `బాలెన్సియాగా` బ్రాండ్. పీసీ శ‌రీర‌భాష‌కు ప‌ర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యింది. పీసీకి నిక్కీ మేక‌ప్ చేయ‌గా.. లూక్ రోజ్ హెయిర్ డిజైన్ చేశారు. ఫ్రెడ‌రిక్ ఫోటోగ్ర‌ఫీ అందించారు. పీసీ ల‌గ్జ‌రీ లుక్ వెన‌క ల‌గ్జ‌రీ లా అనే కంపెనీ స్టైలింగ్ ప‌నిత‌నం ఉందిట‌. సింపుల్ లుక్ తో క‌నిపించినా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్న ఈ ఫోటో వెబ్ లో వైర‌ల్ గా మారింది.