Begin typing your search above and press return to search.

ఒంట‌రిగా స్పేస్ లో చిక్కుకుపోయిన నిక్.. ‌పీసీ ఏం చేసిందంటే?

By:  Tupaki Desk   |   12 March 2021 4:33 AM GMT
ఒంట‌రిగా స్పేస్ లో చిక్కుకుపోయిన నిక్.. ‌పీసీ ఏం చేసిందంటే?
X
నాన్న‌కు ప్రేమ‌తో అంటూ సుక్కూ కానుకిచ్చాడు. భార్య‌కు ప్రేమ‌తో అంటూ ప్రియాంక చోప్రాకు నిక్ జోనాస్ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా? ఇదిగో ఈ ఆల్బ‌మ్ చూశాక రెండు విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. నిక్ స్పేస్ మ్యాన్ గా మారి విర‌హంతో వీగిపోయాడు. అంత‌రిక్షంలో ఒంట‌రిత‌నం వ‌ల్ల‌ పిచ్చోడైపోయాడు. మ‌న‌సిచ్చి మ‌నువాడిన ప్రియురాలు కం భార్యామ‌ణి త‌న చెంత లేక‌పోతే ఏమైపాతాడో ఇలా పాట రూపంలో చూపించాడు.

అమెరిక‌న్ సింగ‌ర్ కం న‌టుడు నిక్ జోనాస్ తన తాజా పాట `స్పేస్ మ్యాన్` మ్యూజిక్ వీడియోను ఆవిష్కరించగా.. ఇలా రిలీజైందో లేదో అలా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అంత‌గా ఆ పాట‌లో ఏం ఉంది? అంటే.. సాంగ్ ఆద్యంతం త‌న ఒంటరితనం పీసీ‌పై ఉన్న ప్రేమను వ్య‌క్తం చేసిన తీరు మైమ‌రిపిస్తోంది. త‌న భార్య‌పై ప్రేమ‌తో ఈ ఆల్బ‌మ్ రూపొందిస్తున్నానని నిక్ ఇంత‌కుముందే చెప్పారు కాబ‌ట్టి స్పేస్ మ్యాన్ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూసారు.

ఆస‌క్తిక‌రంగా ఈ వీడియోలో నిక్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను కోల్పోయినప్పుడు చూసే హోలోగ్రామ్ ‌లో పీసీ క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేసింది. ఇంతకుముందు జోనాస్ బ్రదర్స్ రూపొందించిన ఓ రెండు వీడియోలలోనూ పీసీ నటించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కూడా స‌డెన్ సర్ ప్రైజ్ తో ఆక‌ట్టుకుంది.

ప్రియాంకపై తనకున్న ప్రేమతో ఆల్బమ్ పాటలు ప్రేరణ పొందాయని నిక్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను తన భావాలను స్పేస్ మన్ ‌తో స‌రిపోతాయ‌ని భావించి ఈ ఆల్బ‌మ్ రూపొందించాడు. ప్రేయ‌సిపై భార్య‌పై త‌న ప్రేమ‌ను మాట‌ల్లో చెప్ప‌లేడు. అందుకే ఇలా పాట‌ల్లో చెబుతున్నాడు‌.

``చాలా పాటలు చక్కని ప్రేమలేఖలు.. సంగీతం లేని నా మాటలు ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌లేవు. అందుకే నేను నా భావాల్ని చెప్పలేనప్పుడు స్టూడియోకి వెళ్తాను. అది త‌న(పీసీ)కూ ఇష్ట‌మే`` అని 28 ఏళ్ల గాయకుడు ఆపిల్ మ్యూజిక్ ఇంట‌ర్వ్యూలో అన్నారు.

గురువారం లైవ్ చాట్ సందర్భంగా ప్రియాంక నిక్ పెద‌విపై చుంబించడం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ ఆల్బమ్ కు నా భార్య ప్రేరణ .. నా జీవితంలో ప్రతిదానికీ ఆమె ప్రేరణ! అంటూ మురిపెంగా చెప్పాడు నిక్. ఇక ఈ వీడియోలో నిక్ ని పెద‌విపై ముద్దాడగా దానిపై అభిమానులు ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌ల్ని జోడించారు.