Begin typing your search above and press return to search.

నేను దీంతో ఏమి చేయాలి! షాక్ లో అమెరికా కోడ‌లు!!

By:  Tupaki Desk   |   30 Nov 2020 3:00 PM IST
నేను దీంతో ఏమి చేయాలి! షాక్ లో అమెరికా కోడ‌లు!!
X
అమెరిక‌న్ సింగ‌ర్ కం న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక పీసీ అమెరికాలోనే సెటిలైన సంగ‌తి తెలిసిందే. పార్ట్ టైమ్ మాత్ర‌మే ముంబైకి వ‌చ్చి వెళుతోంది. భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి అమెరిక‌న్ టీవీ సిరీస్ లు షోల‌తో బిజీ అయిపోయిన పీసీ హాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తోంది.

ఇటీవ‌ల లాక్ డౌన్ సీజ‌న్ లో పీసీ భ‌ర్త నిక్ జోనాస్ అత్త‌మామ‌ల‌తో క‌లిసి నివ‌శించింది. అక్క‌డ భ‌ర్త ఫ్యామిలీతో క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

అదంతా స‌రే కానీ.. పీసీ ముందు క‌నిపిస్తున్న ఆ బ్రంచ్ ప్లేట్ చూశారా? అలా చూడ‌గానే ఎలా అయిపోయిందో? పీసీ ఆ ఎక్స్ ప్రెష‌న్ దేనికో అర్థ‌మైంది క‌దూ? లండన్ లో ఉన్న ప్రియాంక చోప్రాకు ఆదివారం బ్రంచ్ ఏర్పాటు ఇది. అందులో ఐటెమ్స్ ఏమిటో చూస్తున్నారుగా..! పూర్తిగా క‌ట్ చేయ‌ని పెద్ద పెద్ద ముక్క‌లు చూసి షాక్ తిన్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇంత‌కీ అది నాన్ వెజ్ నా .. వెజ్ వంట‌కాలేనా? అన్న‌ది పూర్తిగా తెలియాల్సి ఉంది.

ఆదివారం ఇన్ స్టాగ్రామ్ ‌లో ఈ ఫోటోని షేర్ చేసింది ప్రియాంక. ``నేను దీనితో ఏమి చేయాలి! ??`` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. అక్క‌డ పీసీ కాకుండా ఇంకెవ‌రు ఉన్నా చ‌క‌చ‌కా లాగించేసేవారే. కానీ ఆవిడేమిటో అంత‌గా ఆశ్చ‌ర్య‌పోతోంది. పీసీ ప్ర‌స్తుతం రాజ్ కుమార్ రావ్ తో క‌లిసి నెట్ ఫ్లిక్స్ మూవీ వైట్ టైగ‌ర్ ప్రాజెక్టుతో బిజీ. అలాగే `వి కెన్ బీ హీరోస్` అంతర్జాతీయ ప్రాజెక్టులో కూడా కనిపించనుంది. పిల్లల చిత్రాలలో భారీ బ‌డ్జెట్ చిత్రంగా ప్రచారమ‌వుతోంది. హాలీవుడ్ లో ర‌క‌ర‌కాల టీవీ సిరీస్ ల నిర్మాణానికి పీసీ పెట్టుబ‌డులు పెట్ట‌నుంది.