Begin typing your search above and press return to search.

కొత్త ఇంటికి మారిన స్టార్ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   7 July 2016 5:16 AM GMT
కొత్త ఇంటికి మారిన స్టార్ హీరోయిన్‌
X
బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్ విలన్ ప్రియాంక చోప్రా ఇన్నేళ్లూ పేరెంట్స్ తో కలిసి నివసించేది. యారీ రోడ్ లోని అపార్ట్ మెంట్లోనే ఉండేది పీసీ. అయితే.. తనదైన కొత్త ఇంటికోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న ఈ భామ.. దర్యా మహల్ ని కొనేందుకు గతేడాది గట్టిగానే ప్రయత్నించింది. ఈ డీల్ సెట్ కాకపోవడంతో ఆగిపోయిన ప్రియాంక.. ఇప్పుడు ఓ సొంత ఇంటికి ఓనర్ అయిపోయింది.

జుహులో ఓ లగ్జరియస్ ఫైవ్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు అక్కడికి మారిపోయింది. 'ప్రస్తుతం నేను ముంబైలో అంత ఎక్కువగా ఉండడం లేదు. అందుకే పేరెంట్స్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. అమ్మతో విడిపోవడం అంటే బొడ్డుతాడు తెగినట్లుగా ఉంది. లైఫ్ లో మొదటి సారిగా నేను లేకుండా తను నివసించాల్సి వస్తోంది' అని చెప్పింది ప్రియాంక. 2013లో ప్రియాంక తండ్రి చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే పీసీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యవహారాలను ఆమె తల్లి మధుచోప్రానే చూసుకుంటుంది.

ఇక తనకు అందుతున్న పేమెంట్స్ విషయంలో కూడా రిటార్ట్ ఇచ్చింది పీసీ. కొత్త ప్రాజెక్టులకు 35 కోట్లు అడుగుతోందని.. రీసెంట్ గా ఎండార్స్ మెంట్స్ తో 100 కోట్లు సంపాదించిందని.. ఒక్కో అవార్డ్ ఫంక్షన్ లో పెర్ఫామెన్స్ కు 2 కోట్లు ఛార్జ్ చేస్తోందని ప్రియాంకపై వార్తలు వస్తున్నాయి. ఆ అంకెలన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పిన ప్రియాంక చోప్రా.. ఎవరికైనా తగినంత మొత్తాన్నే చెల్లిస్తారని అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు ఎవరూ సిద్ధపడరని చెప్పింది.