Begin typing your search above and press return to search.

ఆస్కార్ ఫోటోలను బైట పెట్టిన ప్రియాంక

By:  Tupaki Desk   |   28 Feb 2016 7:00 PM IST
ఆస్కార్ ఫోటోలను బైట పెట్టిన ప్రియాంక
X
ప్రపంచంలో అత్యంత ఖరీదైన సినిమా పండుగ ఆస్కార్. ఫిలి ఇండస్ట్రీకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ఆస్కార్ లే. మరి ఈ ఏడాది ఈ వేడుకకు, భారతీయ సిని ప్రేక్షకులతో ఓ రిలేషన్ ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుక జరిగేందుకు.. గంటల్లోనే టైం ఉండడంతో.. దీనికి సంబంధించిన ప్రతీ అప్ డేట్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రదానంలో.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ప్రమోట్ అవుతున్న ప్రియాంక చోప్రా కూడా ఉంది. అంటే ఈమె చేతుల మీదుగా ఒకటి రెండు అవార్డుల అనౌన్స్ మెంట్, అవార్డ్ ప్రదానం ఉంటాయన్న మాట. ఇప్పటికే ఆస్కార్ వెన్యూకు చేరుకున్న ప్రియాంక.. అక్కడి ఏర్పాట్లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఈ అవార్డుల వేడుక నిర్వహణ అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో.. ముందుగా రిహార్సల్స్ జరుగుతాయి. అలా తను చేస్తున్న రిహార్సల్స్ - స్టేజ్ డెకరేషన్ - ఏర్పాట్లు.. ఇలా కొన్ని ఫోటోలను ఆన్ లైన్ లో షేర్ చేసింది ప్రియాంక చోప్రా. ఆస్కార్ అవార్డు ఇచ్చేందుకు చేసే ఏర్పాట్లు ఎలా ఉంటాయో చూచాయగా చెప్పింది. ముందస్తు ఏర్పాట్ల ఫోటోలను చూసి.. అభిమానులు ఆశ్చర్యపోయారని చెప్పక తప్పదు.