Begin typing your search above and press return to search.

మంచుల‌క్ష్మి..ప్రియాంక మాట‌లు విన్నారా?

By:  Tupaki Desk   |   7 May 2017 8:50 AM GMT
మంచుల‌క్ష్మి..ప్రియాంక మాట‌లు విన్నారా?
X
అత్యంత పాశ‌వికంగా.. కిరాత‌కంగా అత్యాచారానికి పాల్ప‌డిన నిర్భ‌య దోషుల‌పై పెద్ద ఎత్తున వ్య‌త‌రేక‌త వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. నిర్భ‌య హంత‌కుల‌కు ఉరిశిక్ష విధించిన సుప్రీంకోర్టు జ‌డ్జిలు సైతం.. ఉరికి మిన‌హా మ‌రెలాంటి శిక్ష ప‌నికి రాద‌ని తేల్చేయ‌టం తెలిసిందే. అంత‌టి పాశ‌విక చ‌ర్య‌కు మ‌ర‌ణ‌శిక్ష త‌ప్ప‌నిస‌రి అంటూ సుప్రీం జడ్జిలు చెప్ప‌టం మ‌ర్చిపోకూడ‌దు. నిజానికి సుప్రీం జ‌డ్జిల తీర్పు మీద దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. ఇలాంటి వేళ‌.. ప్ర‌ముఖ సినీ న‌టి మంచు ల‌క్ష్మి..నిర్భ‌య దోషుల‌కు ఉరిశిక్ష విధించ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌టం సంచ‌ల‌నంగా మారింది. ఉరి విధించ‌టం స‌రికాద‌న్న భావ‌న‌ను ఆమె వ్య‌క్తం చేశారు.

మంచు లక్ష్మి వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. న‌ర‌రూప రాక్ష‌సుల్లాంటి నిర్భ‌య హంత‌కులకు ఎంత‌మాత్రం శిక్ష త‌గ్గించాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా మంచు ల‌క్ష్మి మాట్లాడిన మాట‌లు వైర‌ల్ గా మారాయి. ఇదే స‌మ‌యంలో.. బాలీవుడ్ న‌టీమ‌ణి ప్రియాంక చోప్రా తాజాగా రియాక్ట్ అయ్యారు. నిర్భ‌య దోషుల‌కు ఉరి స‌రైన శిక్ష అంటూ తేల్చిన ఆమె.. త‌న అభిప్రాయాన్ని చెబుతూ..

న్యాయం గెల‌వ‌టానికి ఐదేళ్లు ప‌ట్టింద‌ని.. ఈ తీర్పు క్రూర‌మైన న‌లుగురు దోషుల‌కే కాదు.. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన వారంద‌రికీ గుణపాఠం కావాలన్నారు. ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డే వారి ప‌ట్ల అస్స‌లు జాలి చూపాల్సిన అవ‌స‌రం లేదన్న ఆమె.. అందుకు వారే మాత్రం అర్హులు కారన్నారు. తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌న్న ఆమె.. ఈ దుర్మార్గం త‌ర్వాత యావ‌త్ దేశం ఇదే కోరుకుంద‌న్నారు.

సుప్రీంకోర్టు చెప్పిన‌ట్లు ఇలాంటి విష‌యాల్లో మ‌న గ‌ళాలు ఎప్ప‌టికీ మూగ‌పోకూడ‌ద‌న్న ప్రియాంక‌.. ఎప్ప‌టికీ నిర్భ‌య ఉదంతాన్ని దేశ ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేర‌న్నారు. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు దేశమంతా ఒక్కటై న్యాయం కోసం పోరాడాలన్న ఆమె.. అందుకు త‌గ్గ‌ట్లు మనకి మనమే ప్రతిజ్ఞలు చేసుకోవాలన్నారు. ప్రియాంక మాట‌లు విన్నాక‌.. మంచు ల‌క్ష్మి రియాక్ట్ అయితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/