Begin typing your search above and press return to search.

కలర్ సెట్ అవ్వదని సినిమా ఇవ్వలేదు

By:  Tupaki Desk   |   11 April 2018 10:53 PM IST
కలర్ సెట్ అవ్వదని సినిమా ఇవ్వలేదు
X
పక్క రాష్ట్రాల నుండి వచ్చి టాలీవుడ్ మరియు బాలీవుడ్లో పై స్థాయికి వెళ్లిన హీరోయిన్లు ఉన్నారు. కానీ మన దేశంనుండి వెళ్లి హోలీవుడ్లో పేరు తెచ్చుకున్న నటీమణులు చాలా తక్కువ. కానీ అందులో ఒకరే ప్రియాంక చోప్రా. బాలీవుడ్ ను ఒకరకంగా పాలించిన ఈ భామ ఇప్పుడు హోలీవుడ్లో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. ఈమధ్యనే అక్కడ ఆమె చిన్నబుచ్చుకున్న సందర్భం ఒకటి చెప్పుకొచ్చింది.

హాలీవుడ్ లో రెసిజం కొంత ఎక్కువనే చెప్పుకోవచ్చు. అలాంటి ఒక ప్రాబ్లెమ్ నే పీగ్గీ చాప్స్ కూడా ఎదుర్కొందట. తన రంగు మూలంగా ఆఫర్ ఇవ్వలేదు అంటూ నిజాన్ని బయటపెట్టింది. ఒక సినిమా కు సంబంధించిన వాళ్ళు ప్రియాంక ఏజెంట్ కు ఫోన్ చేసి 'ఆమెకు సరైన ఫీజికాలిటీ లేదు' అని చెప్పారట. ఈ వార్తను ఆమెకు చేరవేయడానికి ఆ ఏజెంట్ 'వారి ఉద్దేశం వాళ్ళకి బ్రౌన్ కలర్ కాని వాళ్ళు కావాలనుకుంటా' అని చెప్పాడట.

ఆ మాటలు తనని బాధపెట్టాయి అని, ఇదంతా సంవత్సరం క్రితం జరిగిన కథ అంటూ చెపి నిట్టూర్చింది ఈ డస్కీ బ్యూటీ. బేవాచ్ అనే హాలీవుడ్ సినిమాతో అక్కడ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం 3 బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తానికి పరదేశంలో పక్షపాతం ఎదురుకోవడం ప్రియాంక చోప్రా కే తప్పలేదన్న మాట.