Begin typing your search above and press return to search.

అందరికీ షాక్ ఇచ్చిన ప్రియాంక చోప్రా

By:  Tupaki Desk   |   8 July 2018 7:12 AM GMT
అందరికీ షాక్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
X

బాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా ఎదిగి.. ప్రస్తుతం హాలీవుడ్ బాట పట్టిన ప్రియాంక చోప్రా విదేశీ ప్రియుడితో కలిసి ప్రేమలో మునిగితేలుతోంది. హాలీవుడ్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త కూడా బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

తాజాగా వీరిద్దరూ ఇండియాలోనే ఉంటున్నారు. ముంబై సముద్ర తీరంలో ప్రియుడి కోసం 100 కోట్లు పెట్టి ఓ భారీ బంగళాను ప్రియాంక కొన్నట్టు రూమర్స్ వచ్చాయి. ఆ ఇంటిలోనే ఈ జంట సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు గా తెలుస్తోంది. ప్రియాంక - నిక్ ల చేతులకు ఒకే మోడల్ రింగ్స్ ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ప్రేమ - పెళ్లిపై ప్రియాంక ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.