Begin typing your search above and press return to search.

మండే ఎండ‌లో పూల్ సైడ్ పీసీ మంట‌లు!

By:  Tupaki Desk   |   30 Aug 2021 7:05 AM GMT
మండే ఎండ‌లో పూల్ సైడ్ పీసీ మంట‌లు!
X
గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా-భ‌ర్త నిక్ జోనాస్ ఆద‌ర్శ‌దాంప‌త్యం నేటిత‌రానికి స్ఫూర్తి. ఆయ‌న‌ను వీడి పీసీ ఒక్క క్ష‌ణం కూడా విడిచి ఉండ‌లేదు. ఇద్ధ‌రి మ‌ధ్య బంధం అంత ఘాఢ‌మైన‌ది. త‌మ జీవ‌న విధానానికి సంబంధించిన దాప‌రికం ఏదీ ఉండ‌దు. బెడ్ రూమ్ రొమాన్స్ మొద‌లు విహార‌యాత్ర‌ల వ‌ర‌కూ ప్ర‌తిదీ ఓపెన్ గా ఇన్ స్టా మాధ్య‌మంలో షేర్ చేయ‌డం ప్రియానిక్ జంట‌కు అల‌వాటు. ఇక పీసీకి ప్ర‌తిచోటా నిక్ ఉండాల్సిందే.. తాను ఇంట్లో ఉన్నా... బ‌య‌ట‌కు షికార్ వెళ్లాల‌న్నా వెంట నిక్ ఉండాల్సిందే. సినిమా షూటింగ్ లు ఉంటే త‌ప్ప మిగ‌తా స‌మ‌యాల్లో నిక్ తో స్పెష‌ల్ రొమాంటిక్ డేట్ జ‌ర్నీలు తెలిసిన‌దే. అంత‌గా భార్య భ‌ర్త‌ల బంధం పెన‌వేసుకుపోవ‌డం అభిమానుల‌కు అన్నివేళ‌లా స‌ర్ ప్రైజింగే. లైఫ్ లో అరుదైన‌ మూవ్ మెంట్స్ ని సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ప్రియాంక చోప్రా ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తుంది. ఈ జంట అన్యోన్య‌త‌ను చూసి అభిమానులు మురిసిపోతుంటారు.

ఈ ఆదివారం భ‌ర్త‌తో క‌లిసి పీసీ ఓ రేంజ్ లో సెల‌బ్రేష‌న్ ప్లాన్ చేసింది. అలా త‌మ ప్యాలెస్ లోనే పూల్ సైడ్ ఈ ల‌వ్ క‌పుల్ ఫుల్ గా చిలౌట్ అవుతున్న ఫోటోగ్రాఫ్ లు వైర‌ల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా బికినీ ధ‌రించి మండే ఎండ‌లో మంట‌లు పుట్టించింది. రెడ్ అండ్ బ్లాక్ టూపీస్ లో కాక‌లు రేపింది. టోన్డ్ బాడీతో మండే ఎండ‌లో పీసీ భంగిమ‌లు హీట్ పెంచాయి. త‌న అంద‌మైన క‌ళ్ల కి స‌న్ గ్లాసెస్ ధ‌రించి సూర్య‌ర‌శ్మిని నేరుగా కంటిలో ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. టాప్ యాంగిల్ లో టాప్ టు బాట‌మ్ అందాల్ని క‌వ‌ర్ చేసి ఇన్ స్టా వేదిగా ఆ ఫోటోని అభిమానుల‌కు షేర్ చేసి ఫిదా చేసింది.

పీసీ చెంత‌నే నినువీడ‌ని నీడ‌ను నేను ! అన్న చందంగా నిక్ కూడా నిక్క‌ర్ స్టార్ లా కూచుని ఉన్నాడు. అయితే పీసీ షేర్ చేసిన ఓ సెల్ఫీ లో నిక్ క‌నిపించ‌లేదు. కేవ‌లం అత‌ని కాళ్లు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఆ స‌మ‌యంలో నిక్ స్నాక్స్ తింటున్నాడు. దాన్ని ప్రియాంక చోప్రా నిక్ చిరు తిండి..! అంటూ హ్యాష్ ట్యాగ్ ని జోడించింది.

వేరొక ఫోటోలో మాత్రం నిక్ ఓపెన‌య్యాడు. అస‌లు మ‌జాక్ ఈ ఫోటోలోనే ఉంది. అత‌డు ఏదో క‌ట్ చేస్తున్నాడు. అది మాత్రం కాస్త షాకింగ్ గానే ఉంది. ప్రియాంక చోప్రా పిరుదుల‌పై అత‌డు స్నాక్ క‌ట్ చేస్తున్నాడ‌ట‌. దీనిపై పీసీ వివ‌ర‌ణ ఇచ్చింది. తన ఆ భాగాన్ని భర్త స్నాక్స్ లా కొరుక్కుతింటున్నాడనే మీనింగ్ వ‌చ్చేలా వ్యాఖ్య‌ను జోడించ‌గా ఫోటోతో పాటు అది వైర‌ల్ అవుతోంది. ఆ స్నాక్స్ మాక్కూడా ఇస్తారా ప్లీజ్! అంటూ కామెంట్స్ చేస్తూ ఈ రొమాంటిక్ భంగిమ‌ను వైర‌ల్ గా షేర్ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ జంట రొమాన్స్ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. పీసీ అభిమానులు టెప్టింగ్ ఫోటోపై హాట్ కామెంట్లు గుప్పిస్తూ మ‌రింత వేడెక్కిస్తున్నారు. అయినా ఈ సెల‌బ్రిటీలేంటి మ‌రీ ఇలా త‌యార‌య్యారు? అంటూ కొంద‌రు కామెంట్ చేస్తుంటే.. నిక్ ఏంటి న‌న్నే మించిపోయాడు.. ఆర్జీవీకే మ‌తిచెడేనే .. అంటూ మ‌రికొంద‌రు ఫ‌న్నీగా వ్యాఖ్యానించ‌డం విశేషం.

ఫ్యాన్స్ ని క‌ల‌వ‌ర‌పెట్టిన పీసీ గాయం

ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో స్టార్ గా బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ఓ హాలీవుడ్ సిరీస్ కోసం సాహ‌సాలు చేస్తున్న ప్రియాంక చోప్రాకు అనుకోని ప్ర‌మాదం ఎదురైంది. ప్రియాంక తన ముఖంపై రక్తపు మరకలతో ఒక స్నాప్ ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా క‌ల‌క‌లం రేపింది. త‌న‌ నుదురుపై చీలింది.. అలాగే బుగ్గ‌పై గాటు ప‌డింది. ఏ గాయం నిజమో..? ఏది కాదో గుర్తించమని ఆమె తన అనుచరులను పీసీ అడిగింది. పీసీ చెంపపై గాయం నిజమని ఆమె నుదుటిపై ఉన్నది గాయం కాదని అనుచరుడు చెప్పినప్పుడు ప్రియాంక క్లారిటీనిచ్చింది. ఫోటోలో ప్రియాంక కనుబొమ్మపై లోతుగా కోసినట్టు గాయం క‌నిపిస్తోంది. కానీ గాయంతో బాధపడకుండా ప్రియాంక సిరీస్ కోసం షూటింగ్ కొనసాగించింది. ప్రియాంక తన తొలి వెబ్ సిరీస్ సిటాడెల్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ప్ర‌మాదంలో గాయ‌ప‌డింది. ఇక నుదురు చీలిపోయి ర‌క్త‌శిక్త‌మై క‌నిపిస్తున్న తీరు చూస్తుంటే గాయం మ‌రీ చిన్న‌దేమీ కాద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఈ యాక్ష‌న్ సిరీస్ కి గతంలో `ఎవెంజర్స్ ఎండ్ గేమ్`కు ద‌ర్శ‌క‌విభాగంలో సాయ‌ప‌డిన రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో కొద్ది భాగం భారతదేశంలో కూడా చిత్రీకరించ‌నున్నారు. ప్రియాంక చోప్రా తదుప‌రి మ్యాట్రిక్స్ 4లోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.