Begin typing your search above and press return to search.

పీసీలో ఈ ఫ‌న్నీ యాంగిల్ కిల్ చేస్తోందిగా

By:  Tupaki Desk   |   20 July 2021 8:09 AM GMT
పీసీలో ఈ ఫ‌న్నీ యాంగిల్ కిల్ చేస్తోందిగా
X
ప్ర‌తి ఒక్క‌రిలో ఫ‌న్ ఎలిమెంట్ ఉంటుంది. అది అవ‌స‌రాన్ని బ‌ట్టి సంద‌ర్భాన్ని బ‌ట్టి బ‌య‌ట‌పడుతుంటుంది. గ్లోబ‌ల్ ఐక‌న్ .. అమెరికా కోడ‌లు పీసీ నుంచి అప్పుడ‌ప్పుడు ఇలా టైమింగ్ లీ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. పీసీలో హ్యూమ‌ర్ సెన్స్ కి సింబాలిక్ గా తాజాగా కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోలు త‌న బ‌ర్త్ డే పార్టీ నుంచి రివీల్ చేసిన‌వి. ప్ర‌స్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సోమ‌వారం గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా సైలెంట్ గా బ‌ర్త్ డే వేడుక‌ల్ని జ‌రుపుకోగా భ‌ర్త‌ నిక్ జోనాస్ స‌హా అభిమానులు ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రులు త‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. పీసీ మామ్ మ‌ధుచోప్రా త‌న‌కు బ‌ర్త్ డే విషెస్ ని తెలిపారు. పీసీ స్వ‌యంగా త‌న‌ నిశ్శబ్ద పుట్టినరోజు వేడుకల నుండి ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోల్లో వేటిక‌వే ప్ర‌త్యేకం. ఒక కొల‌నులో స్నానాలాడుతూ సూర్య‌తాపం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు రిలాక్స్ అవుతున్న‌ ఫోటోలు ఇందులో హైలైట్. త‌నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ స‌హా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పీసీ ప్ర‌స్తుతం త‌దుప‌రి ప్రాజెక్టుల కోసం లండ‌న్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్క‌డే నిశ్శబ్ద పుట్టినరోజు వేడుక‌ల‌ను జ‌రుపుకుంది.

``ఈ పుట్టినరోజు నాపై ప్రేమాభిమానాల‌ను ఆప్యాయతలను క‌న‌బ‌రిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా అద్భుతమైన గ్రంథానికి స‌రిప‌డే కథల ట్వీట్లు ఆక‌ట్టుకున్నాయి. ఇది నిశ్శబ్ద పుట్టినరోజు కానీ మరుసటి సంవత్సరంలో నేను అడుగుపెట్టినప్పుడు నేను నేర్చుకున్న ప్ర‌తి పాఠం ప్రతిరోజూ ఒక ఆస్వాధ‌న లాంటివి. మీ శుభాకాంక్షలు.. నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. ఈ రోజును చాలా ప్రత్యేకమైనదిగా చేసినందుకు ధన్యవాదాలు. నిక్ జోనాస్ కూడా ఇక్క‌డ లేరు. నా బర్త్ డే వారాంతపు బడ్డీలుగా ఉన్నందుకు థాక్స్..`` అని వ్యాఖ్యానించారు పీసీ.

అంతకు ముందు రోజు నిక్ జోనాస్ తన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రియాంక చోప్రా ఫోటోల‌ను షేర్ చేశారు. కొన్ని ఫోటోల్లో కెమెరా ముందు ఫోజులు కొడుతున్న పీసీ లుక్ వేడెక్కించ‌గా.. మ‌రికొన్ని ఫోటోల్లో చిన్నతనంలోని పీసీ లుక్ కి సంబంధించిన ఫోటో రివీలైంది. ``పుట్టినరోజు శుభాకాంక్షలు మై ల‌వ్. ప్రపంచంలోని అన్ని ఆనందాలకు మీరు అర్హులు. ఈ రోజు ప్రతి రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను`` అని తెలిపారు.

ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ 19జూలై 2018 న నిశ్చితార్థం చేసుకున్నారు.. ఎంగేజ్ మెంట్ వార్షికోత్సవం మొద‌లు బాలీవుడ్ లో త‌న వైపు వ‌చ్చిన ప్ర‌తి ఆఫ‌ర్ ని కాద‌నుకుంది. స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న భార‌త్ చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌రించినా కాద‌నుకుంది. ప్ర‌స్తుతం పీసీ హాలీవుడ్ లో బిజీ స్టార్ గా వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

ప్రియాంక ప్రస్తుతం త‌న త‌దుప‌రి వెబ్ సిరీస్ సిటాడెల్ చిత్రీకరణ కోసం లండ‌న్ లో ఉంది. ఇది రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న సిరీస్. ది మ్యాట్రిక్స్ 4- టెక్స్ట్ ఫర్ యు- మిండీ కాలింగ్ స‌హా ఒక రోమ్-కామ్ లోనూ చేస్తోంది. నిక్ తో రియాలిటీ షోలను చేసేందుకు పీసీ స‌న్నాహ‌కాల్లో ఉంది. మ‌రోవైపు ఓ ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో పీసీ ప‌లు వెబ్ షోలు సిరీస్ లు నిర్మించేందుకు భారీ ఒప్పందం చేసుకుంది. ఈ సిరీస్ లు షోలు భార‌తీయ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్నాయ‌ని ఇంత‌కుముందు వెల్లడించారు. ఓవ‌రాల్ గా పీసీ స్టార్ హీరోయిన్ గా హ‌వా సాగిస్తూనే మ‌రోవైపు ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని ర‌న్ చేస్తూ సాటి స్టార్ల‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.