Begin typing your search above and press return to search.

ప్రియానిక్ జంట బీచ్ ని మ‌రిగించారుగా!

By:  Tupaki Desk   |   4 Jan 2020 9:39 AM GMT
ప్రియానిక్ జంట బీచ్ ని మ‌రిగించారుగా!
X
న్యూ ఇయర్ వైబ్స్ ఇంకా ముగిసి పోలేదు.. వేడుకలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవిగో ఈ ఫోటోలు- వీడియో పోస్ట్ లే అందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. తాజాగా నిక్ జోనాస్ -ప్రియాంక చోప్రా జోనాస్ - స్నేహితుల తో క‌లిసి బీచ్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన లైవ్‌ ఫోటోలను నిక్ అభిమానుల‌కు షేర్ చేశాడు. ప్రియానిక్ స్నేహితుల బృందంతో బీచ్ సెల‌బ్రేష‌న్స్ ని ఏ రేంజులో ఎంజాయ్ చేసారో ఈ ఫోటోలు చెబుతున్నాయి.

``ప్రతిదీ ఆనంద‌మ‌యం.. స్నేహితులకు కృతజ్ఞతలు. మాతో ఉన్న స్నేహితులకు .. దూరంగా ఉన్న స్నేహితుల‌కు ధ‌న్య‌వాదాలు. కొత్త సంవత్సరం ప్రారంభించే ఉద్వేగం లో ఉన్నాం..`` అంటూ వ్యాఖ్య‌ను నిక్ జోడించారు. అయితే అదంతా స‌రే కానీ.. జ‌నాల‌ దృష్టి మాత్రం పూర్తిగా నిక్ ఒడిలో కూర్చుని ఉన్న వైఫ్ ప్రియాంక చోప్రా పైనే నిలిచి ఉంది. ఈ వేడుక‌ల్లో నిక్ సాధారణ దుస్తులను ధరించగా.. ప్రియాంక బీచ్ లుక్ డిజైన‌ర్ డ్రెస్ ని ధరించింది. ఇక పీసీని చిక్ పై ముద్దాడేస్తూ నిక్ ఎంతో ఉల్లాసంగా క‌నిపిస్తున్నాడు.

పీసీ కెరీర్ ని చూస్తే.. 2019లో `ది స్కై ఈజ్ పింక్‌`లో ఫర్హాన్ అక్తర్ స‌ర‌స‌న న‌టించింది. ఈ చిత్రంలో రోహిత్ సరాఫ్ - జైరా వసీమ్ కీల‌క పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చ‌క్క‌ని సమీక్షలు వ‌చ్చాయి. పీసీ న‌ట‌న‌ కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. త‌దుప‌రి తన చిత్రానికి సంబంధించిన షూటింగు లో పాల్గొనేందుకు పీసీ ఇప్ప‌టికే భారతదేశం లో అడుగు పెట్టింద‌ట‌.