Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో ప్రియాంక చోప్రా స్టెప్పులు?

By:  Tupaki Desk   |   27 Sept 2018 4:05 PM IST
ఎన్టీఆర్ తో ప్రియాంక చోప్రా స్టెప్పులు?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత' మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఐటెం నెంబర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది. 'అరవింద సమేత' లో పక్కా లోకల్ లాంటి ఐటెం నెంబర్ కోసం ఎన్టీఆర్ తో గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా స్టెప్పులు వేస్తుందనేది దాని సారాంశం. మరి ఈ వార్త నిజమేనా?

నిక్ జోనాస్ ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేక హిందీ సినిమాలను కూడా వదులుకుంటున్న ప్రియాంక తెలుగు సినిమా లో ఐటెం నెంబర్ కోసం పచ్చజెండా ఊపిందనడం నమ్మొచ్చా? నిజానికి ప్రియాంక హాలీవుడ్ వెళ్ళిన తర్వాత ముంబైలో అడుగుపెట్టడమే గగనమై పోయింది. జస్ట్ ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగితేనే అక్కడి మీడియా 'పీసీ అయా హై.. సాథ్ మే నిక్ సాబ్ హై' అంటూ పండగ చేసుకుంటున్నారు. మరి ఆమె హైదరాబాద్ రావడం ఐటెం సాంగ్ షూటింగ్ లో పాల్గొనడం జరిగేపనేనా?

ఈ న్యూస్ అంతా గాసిప్ రాయుళ్ళ పనేనని కొట్టి పారేస్తున్నారు ఎన్టీఆర్ సినిమాకు పని చేస్తున్న వారు. ప్రియాంక రీసెంట్ గా ఇషా అంబాని ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యేందుకు నిక్ తో పాటు కలిసి ఇటలీ వెళ్లింది. అదే సమయంలో 'అరవింద సమేత' టీమ్ పాటల చిత్రీకరణ కోసం ఇటలీలోనే ఉండడంతో హీరోయిన్ పూజా హెగ్డే.. ప్రియాంక ను కలవడం జరిగింది. ఇక ఒక ఫ్రేమ్ లో అరవింద - గ్లోబల్ సుందరి ఉండడంతో మన క్రియేటివ్ జనాలు ఒక ఫోటో స్టొరీ రాశారు. ఇప్పటివరకూ అయితే అంతే.