Begin typing your search above and press return to search.
70 కోట్లొచ్చినా.. ఆస్కార్ ఛాన్స్ మిస్
By: Tupaki Desk | 27 Sept 2017 10:36 PM ISTఅందాల భామ ప్రియాంక చోప్రా పరిస్థితి.. ఇప్పుడు ఆనందించాలో.. తెగ బాధపడిపోవాలో అర్ధం కాని సిట్యుయేషన్. ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్.. ఏది ముందు చెప్పమంటావ్.. లాంటి డైలాగులు సినిమాల్లోను రియల్ లైఫ్ లోనూ వింటూనే ఉంటాం. ఇప్పుడు పీసీ పరిస్థితి కూడా ఇదే. కాకపోతే రెండు న్యూస్ ఒకేసారి ఆమె చెంతకు చేరడంతో.. ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కావడం లేదట.
ఓ ఏడాది కాలంగా ప్రియాంక సంపాదనకు సంబంధించిన లెక్కలు రీసెంట్ గా బయటకు వచ్చాయి. కేవలం వన్ ఇయర్ లో 70 కోట్లను వెనకేసుకుందట ఈ భామ. ఓ బాలీవుడ్ హీరోయిన్.. ఇంత షార్ట్ స్పాన్ లో ఇంతమొత్తం కూడబెట్టడం పెద్ద రికార్డ్. ఇదంతా ఆమె నటించిన క్వాంటికో సిరీస్ పుణ్యమే. ఒక్కో సీజన్ కు 3 మిలియన్ డాలర్లు పుచ్చుకోగా.. ఇతర ఎండార్స్ మెంట్స్ తో కలిి.. మొత్తం 10.5 మిలియన్ డాలర్లు.. ప్రియాంక చోప్రా బ్యాంక్ అకౌంట్స్ లోకి వచ్చేశాయి. ఏడాదంతా గ్యాప్ లేకుండా కష్టపడిపోయినా.. ఓ బాలీ హీరోయిన్ కు ఇది చాలా పెద్ద మొత్తమే. అలాంటి ఫీట్ ను అలవోకగా అందుకుంది పీసీ. ఇది గుడ్ న్యూస్ అయితే.. ఇప్పుడు బ్యాడ్ సంగతి చూద్దాం.
రీసెంట్ గా ఇండియా నుంచి ఆస్కార్ బెస్ట్ ఫారిన్ ఫిలిం అవార్డ్ కేటగిరీకి న్యూటన్ ఎంపికైన సంగతి తెలిసిందే. కానీ ఈ రేసులో తన బ్యానర్ అయిన పర్బుల్ పెబుల్ పిక్చర్స్ పై నిర్మితమైన మరాఠీ మూవీ వెంటిలేటర్ నిలుస్తుందని పిగ్గీ ఛాప్స్ బాగా నమ్మకంగా ఉందట. అఫ్ కోర్స్.. వెంటిలేటర్ కు ఆ లక్షణాలు.. అర్హత ఉన్నాయని అందరూ నమ్మారు కూడా. జనాలకు కూడా బాగా నచ్చేసి 25 కోట్ల వసూళ్లు ఇచ్చి బ్లాక్ బస్టర్ చేశారు. ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిస్తే.. హాలీవుడ్ లో తన పరిచయాలు ఉపయోగించుకుని.. ఆస్కార్ వరకూ తీసుకెళ్లగలిగేందుకు తగిన స్కెచ్ ను కూడా వేసుకుందట ప్రియాంక.
కానీ వెంటిలేటర్ పరిస్థితి.. ఇక్కడే వెంటిలేటర్ మీదకు వచ్చేసింది. న్యూటన్ ఏమో రేసులో దూసుకుపోయాడు. ఇది ప్రియాంక ఫేస్ చేసిన బ్యాడ్ న్యూస్. మరిప్పుడు చెప్పండి.. ఏడాదిలో 70 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందని ప్రియాంక చోప్రా సంతోషించాలా.. లేక ఆస్కార్ వచ్చే ఛాన్స్ మిస్ అయిందని బాధపడాలా?