Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌: అమెరికా కోడ‌లు దుమారం

By:  Tupaki Desk   |   17 May 2019 10:27 AM IST
ఫోటో టాక్‌: అమెరికా కోడ‌లు దుమారం
X
అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా లైఫ్ ని పెళ్లికి ముందు పెళ్లి త‌ర్వాత అన్న కోణంలో చూడాల్సి ఉంటుంది. అమెరిక‌న్ సింగర్ కం న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక పీసీ అనుస‌రిస్తున్న ఫ్యాష‌న్ స‌రికొత్త పుంత‌లు తొక్కింది. మునుప‌టితో పోలిస్తే ఇప్పుడు హ‌ద్దులు పూర్తిగా చెరిగిపోయాయి. ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఏ కొత్త ట్రెండ్ వ‌చ్చినా దానిని పీసీ అనుస‌రిస్తోంది. భార‌తీయ‌త స్థానంలో పాశ్చాత్యం ఆవ‌హించింది. హాలీవుడ్ స్టార్స్ యాంజెలినా.. బ్రిట్నీ స్పియ‌ర్స్.. లేడీ గాగాల‌నే త‌ల‌ద‌న్నే వ‌య్యారంతో కుర్ర‌కారు కంటికి కునుకు ప‌ట్ట‌నీకుండా చేస్తోంది. నిక్ జోనాస్ పీసీ అంద‌చందాల‌కు దాసుడు అయిపోయి ప‌బ్లిక్ వేదిక‌ల‌పైనే రొమాన్స్ తో చెల‌రేగిపోతున్నాడు. ఇటీవ‌ల కొన్ని ఫోటోషూట్లు టూమచ్ హాట్ అంటూ నెటిజనులే కామెంట్లు చేశారు.

ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా కేన్స్ 2019 ఉత్స‌వాల్లో రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో షేకాడిస్తోంది. పీసీ ఇప్ప‌టికే రెండు విభిన్న‌మైన డిజైన‌ర్ డ్రెస్ ల‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఒక‌టి వైట్ అండ్ వైట్ ముత్యాన్ని త‌ల‌పించే డిజైన‌ర్ లుక్ లో.. వేరొక‌టి డార్క్ పింక్ .. షిమ్మ‌రీ బ్లాక్ క్రిస్ట‌ల్స్ తో డిజైన్ చేసిన స్ట్రాప్ లెస్ గౌనులో పీసీ దుమారం రేపింది. ఇప్ప‌టికే ఎన్నో ప‌బ్లిక్ ఈవెంట్ల‌లో పీసీ అద‌ర‌గొట్టేసిన సంద‌ర్భాలున్నాయి. ఈసారి కేన్స్ లో అభిమానుల్ని ఏమాత్రం నిరాశ‌ప‌ర‌చ‌లేదు. పీసీ కొత్త లుక్ గురించి ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ హాట్ హాట్ గా చ‌ర్చ సాగుతోంది.

ప్రియాంక చోప్రా ఈ ఈవెంట్ లో ఓ రెండు సినిమాల స్క్రీనింగ్ ల‌కు ఎటెండ్ అయ్యింది. హెచ్ ఐవీ/ ఎయిడ్స్ పై రూపొందించిన 5బీ అండ్ లేట‌ర్ డాక్యుమెంట‌రీని వీక్షించిన పీసీ అనంత‌రం మ్యూజిక‌ల్ ఫాంట‌సీ `రాకెట్‌మేన్` (క్లాసిక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎల్ట‌న్) అనే వేరొక‌ డాక్యుమెంట‌రీని వీక్షించింది. ఫ్యాషన్ ఈవెంట్లు స‌రే.. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా ఏదైనా సినిమాలో న‌టిస్తోందా? అంటే అటు హాలీవుడ్ సినిమాల పెండింగ్ షూట్ ని పూర్తి చేసి పూర్తిగా వ్య‌క్తిగ‌త జీవితానికే కేటాయిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.