Begin typing your search above and press return to search.

ప్రియాంకను చూసి ఫ్యాన్స్ షాక్

By:  Tupaki Desk   |   14 April 2018 6:37 AM
ప్రియాంకను చూసి ఫ్యాన్స్ షాక్
X
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి చాలా మంది నటీనటులు షిఫ్ట్ అయ్యారు. కానీ ఈజీగా ఎవరు సక్సెస్ అవ్వలేదు. అక్కడ అవకాశం దొరకడమే లక్. ఇక గుర్తింపు తెచ్చుకోవాలంటే శక్తికి మించి కష్టపడాలి. అయితే ఒక ఇండియన్ నటి మాత్రం చాలా తొందరగా పికప్ అయ్యింది. ఆమె ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. హాలీవుడ్ లో అలా అడుగుపెట్టగానే ప్రియాంక చోప్రాకి మంచి గుర్తింపు దక్కింది.

పైగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లకు బికినీ స్టిల్స్ ఇవ్వడంతో క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడిపుడే ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె నటించిన రెండవ హాలీవుడ్ సినిమా ఎ కిడ్‌ లైక్‌ జాక్‌ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఆయితే ఈ సినిమాలో ప్రియాంక పాత్ర చాలా కీలకమని ముందు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ట్రైలర్ చూసిన తరువాత అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మూడు సెకన్ల కంటే ఎక్కువగా కనిపించలేదు. కథలో ముఖ్యమైన పాత్ర అన్నట్లు కూడా అనిపించడం లేదు.

ప్రముఖ హాలీవుడ్‌ యాక్టర్స్ జిమ్‌ పార్సన్స్‌ అలాగే క్లైరే డేన్స్‌ ప్రధాన పాత్రల్లో కనిపించగా ఒక స్నేహితురాలిగా అమల్‌ పాత్రలో ప్రియాంక చోప్రా నటించింది. జాక్‌ అనే ఒక నాలుగేళ్ల పాప చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చిన్నారి ఆలోచన విధానం అలాగే స్వభావం ఆమె తల్లిదండ్రులకు ఎలాంటి పరిస్థితులను కలుగజేశాయి అనే సింపుల్ పాయింట్ తో సినిమాను తెరకెక్కించారు. సిలాస్‌ హోవార్డ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇప్పటికే సన్‌ డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ప్రదర్శించారు. మరి ప్రియాంకకు ఈ సినిమా ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

ట్రైలర్ చూడటానికి క్లిక్ చేయండి