Begin typing your search above and press return to search.

ఉయ్యాలలో పీసీ నైటీ మంట‌లు

By:  Tupaki Desk   |   1 Jan 2022 1:30 AM GMT
ఉయ్యాలలో పీసీ నైటీ మంట‌లు
X
2021 కి గుడ్ బై చెబుతూ 2022కి వెల్క‌మ్ చెప్ప‌డానికి సెల‌బ్రిటీలంతా రెడీ అయ్యారు. ఇప్ప‌టికే చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు సెల‌బ్రేష‌న్స్ కోసం విదేశాలు చెక్కేసారు. స్టార్స్ క‌పూల్స్ సైతం ఔట్ డోర్ లోనే వేడుక‌లు ప్లాన్ చేసుకున్నారు. ముంబై సిటీలో ఉన్న వాళ్లు అంతా ముందుగానే ప‌బ్ ల్ని బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు. ఇక గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి అమెరికాలోనే వేడుక‌ల్ని సెల‌బ్రేట్ చేసుకోబుతుంది. దానికి సంబంధించిన ఓ హింట్ కూడా ఇచ్చేసింది.

`రెడీ టీ స్వింగ్ ఇన్ టూ 2022` అంటూ రెండు వేళ్లు ఉన్న ఎమోజీని పోస్ట్ చేసింది. పీసీ ఎంట్రీ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే నైటీలో బ్యూటీ మంట‌లు మాత్రం చ‌ల్లార‌డం ఇప్ప‌ట్లో సాధ్యం కాదేమో. లైట్ పింక్ క‌ల‌ర్ నైటీ ధ‌రించి సాయంకాలం సంధ్య వేళ‌లో మేడ‌పై ఉయ్యాలో కూర్చోని అలా ముందుకి వెన‌క్కి ఉగుతూ సేద తీరుతుంది. మ్యాచింగ్ క్రాక్స్ ధ‌రించింది. క‌ళ్ల‌కు అద్దాలు ధ‌రించి అంద‌మైన న‌వ్వుతో ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు ఆస‌క్తిక‌ర పోస్ట్ లు కామెంట్ చేస్తున్నారు.

ఐల‌వ్ యూ బ్యూటీ అంటూ ల‌వ్ సింబ‌ల్ ఉన్న ఎమోజీల‌ను పోస్ట్ చేస్తున్నారు. నిక్ జోనాస్ తో వివాహం త‌ర్వాత ప్రియాంక చోప్రా అమెరికాలోనే ఎక్కువ‌గా ఉంటుంది. హ‌లీవుడ్ లో సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ నిక్ కార‌ణంగా ఎక్కువ‌గా యూ ఎస్ లో ఉంటుంది. నిక్ అంటే పీసీ కి ఎంతో ప్రేమాభిమానం. భ‌ర్త‌ని కంటికి రెప్ప‌లా పాపాయిలా చూసుకుంటుంది. అత‌నికి కెరీర్ ప‌రంగానూ పీసీ మంచి స‌పోర్ట్ ఇస్తోంది. అందుకే అమెరికాలోనే స్థిర‌ప‌డ్డారు. అలాగని బాలీవుడ్ సినిమాల్ని ప్రియాంక అశ్రద్ధ చేయ‌లేదు. ఇక్క‌డ అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటోంది.