Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ డేట్ లోనే పీసీ అన్నింటికి సై!

By:  Tupaki Desk   |   17 May 2023 12:31 PM
ఫ‌స్ట్ డేట్ లోనే పీసీ అన్నింటికి సై!
X
గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్...హాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలిసారి ఓ భార‌తీయ న‌టి హాలీవుడ్ లో ఇంత ఫేమ‌స్ అవ్వ‌డం అన్న‌ది ఇదే తొలిసారి. ఎంతో మంది భామ‌లు హాలీవుడ్ ప్ర‌య‌త్నాలు చేసినా! స‌క్సెస్ అవ్వ‌లేదు. ఆ ర‌కంగా ఇంగ్లీష్ తార‌ల‌తో పోటీ ప‌డిన మొట్ట మొద‌టి నాయిక‌గా పీసి నిలిచింది. ప్ర‌స్తుతం అక్క‌డ కెరీర్ సంతోషంగా సాగిపోతుంది.

ఇటీవ‌లే అమ్మ‌డు న‌టించిన 'సీటాడెల్' కూడా రిలీజ్ అయింది. ఈ సిరీస్ రిలీజ్ లో భాగంగా వృత్తి.. వ్య‌క్తిగ‌తానికి సంబంధించిన ఎన్నో విష‌యాలు మీడియాతో పంచుకుంది. ఈ నేప‌థ్యంలో తాజా ఇంట‌ర్వ్యూ లో శృంగారం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మొద‌టి డేట్ లోనే శృంగారానికి ఒప్పుకుంటారా? అని ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. య‌స్ క‌చ్చితంగా ఒప్పుకుంటాను.

'శృంగారం వ‌ల్ల ఒక‌రిపై ఒక‌రు న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. ఎవ‌రు ఎలా ఉంటారో? వెంట‌నే ఓ క్లారిటీ వ‌స్తుంది. భ‌విష్య‌త్ లో మ‌న‌తో ఎలా ఉంటాడో విష‌యాలు చెబుతారు. మ‌న‌సులో భావాలు బ‌య‌ట పెట్ట‌డానికి అవ‌కా శం ఎక్కువ‌గా ఉంటుంది' అని అంది. అలాగే గ‌త రిలేష‌న్ షిప్స్ గురించి మ‌రోసారి రివీల్ చేసింది.

పెళ్లికి ముందు చాలా మందితో డేటింగ్ చేసా. కానీ అ బంధాలు ఎక్కువ కాలం నిల‌వ‌డ లేదు. కొన్ని ఎప్పుడూ గుర్తుంచుకునేలా ఉంటే? మ‌రికొన్ని వాటిని ఎంత తొంద‌ర‌గా మర్చిపోతే అంత మంచిది అనేలా అనిపించాయి' అని తెలిపింది.

ఈ బ్యూటీ తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న 'తుఫాన్' చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌చ్చినా..అప్ప‌టికే హాలీవుడ్ లో న‌టిస్తుండ‌టంతో అక్క‌డ చిత్రాల‌పైనే దృష్టి నిలిపింది.

హిందీ సినిమాల‌కు సైతం చాలా కాలంగా దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. సొంత భాష‌పైనా ఆ మ‌ధ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి వెన‌క్కి తీసుకున్న సంఘ‌ట‌న‌లున్నాయి.