Begin typing your search above and press return to search.

రెండు రిలీజ్‌ లు.. నా చేతిలో లేదు

By:  Tupaki Desk   |   1 Aug 2015 5:43 AM GMT
రెండు రిలీజ్‌ లు.. నా చేతిలో లేదు
X
ఫ్యాషన్‌ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది ప్రియాంక చోప్రా. ఆ సినిమా తర్వాత కెరీర్‌ పరంగా బోలెడంత ఎత్తుకి ఎదిగింది. ఉన్నత శిఖరాల్ని అధిరోహించింది. 100కోట్ల క్లబ్‌ నాయికగా పేరు తెచ్చుకుంది. ఏదైనా మహిళా ప్రధాన కథాంశాల్ని ఎంచుకుంటూ మొత్తం భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించే సత్తా ఉన్న నాయికగా తన పేరును సుస్థిరం చేసుకుంది.

అందుకే ప్రియాంక చోప్రా క్రేజు నానాటికి పెరుగుతోంది. ప్రియాంక నటించిన మేరీకోమ్‌ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు క్యూలో ఉన్నాయి. ప్రియాంక నటిస్తున్న బాజీరావు మస్తానీ, అలాగే షారుఖ్ దిల్‌వాలే.. రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజవుతున్నాయి. డిసెంబర్‌ 18 .. ముహూర్తం. అయితే ఒకేరోజు రెండు క్రేజీ ప్రాజెక్టులు విడుదలవ్వడంపై ట్విట్టర్‌ లో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక సినిమాని వాయిదా వేసుకోండని సూచిస్తున్నారు. అయితే ఆ పని నా చేతిలో లేదంటూ ప్రియాంక చెబుతోంది.

అంతేకాదు ప్రియాంక త్వరలోనే అమెరికన్‌ టెలివిజన్‌ షో కోసం ఓ పాట పాడనుంది. ఈ అమ్మడు ఇంతకుముందే ఓ వీడియో ఆల్బమ్‌ కోసం పాట పాడింది. అంతేనా ఇటీవలే దిల్‌ దడ్కనే సినిమా కోసం ఓ పాటను ఆలపించింది కోడా. ఇక క్వాంటికో టీవీ సీరియల్ తో హాలీవుడ్ ను అమ్మడు టచ్ చేస్తున్న విషయం తెలిసిందే.