Begin typing your search above and press return to search.

ఆస్కార్ వేదికపై మెరిసిన యువరాణి

By:  Tupaki Desk   |   29 Feb 2016 11:46 AM IST
ఆస్కార్ వేదికపై మెరిసిన యువరాణి
X
లాస్ఏంజిల్స్ డాల్బీ థియేటర్ లో 88వ ఆస్కార్ వేడుకలో వేదికపై ప్రెజెంటర్ బాలీవుడ్ కం హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సందడి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైన్ జుహైర్ మురాద్ డిజైన్ చేసిన తెల్లటి గౌను ధరించి మెరిసిపోయింది ప్రియాంక. చుట్టును వెనక్కు కట్టి పోనీ టైల్ మాదిరిగా కట్టి హాజరైంది. అయిత్ ఆస్కార్ వేదిక దగ్గరకు వచ్చేటప్పటి వరకూ తన అప్ డేట్స్ ను ఆన్ లైన్ లో అభిమానులతో పంచుకుంది ప్రియాంక.

'ఆస్కార్ వేదిక దగ్గరకు వెళుతుంటే రథంపై ఓ యువరాణిగా వెళుతున్నట్లు అనిపిస్తోంది' అంటూ ట్వీట్ చేసింది ప్రియాంక. ఆ తర్వాత ఆస్కార్ రెడ్ కార్పెట్ స్ట్రాప్ లెస్ గౌనుతో ప్రియాంక చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందంతోనే కాదు.. మాటతీరుతోనూ అబ్బురపరిచింది ఈ భామ. ఆస్కార్ లో ఇప్పటివరకూ చాలామంది భారతీయ భామలు తళుక్కుమన్నారు. అందరికంటే తన ప్రత్యేకతను చాటడానికి ఈమె ధరించిన వైట్ డ్రస్ నిదర్శనం. సాధారణంగా రెడ్ కార్పెట్ పై కొట్టొచ్చినట్లు కనిపించేందుకు గ్రీన్ ఎంపిక చేసుకుంటారు తారలు. కానీ ప్రియాంక మాత్రం వైట్ కలర్ లో వారి కంటే మెరిసిపోతూ కనిపించింది.

ఇప్పటికే క్వాంటికో సీరియల్ లో నటించి హాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం పొందిన ఈ భామ.. ఇప్పుడు బేవాచ్ లో కూడా నటిస్తోంది. తనకొచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ.. తనను ఇంతటి గౌరవమైన బాధ్యతకు ఎంపిక చేయడం ఎంత కరెక్టో ప్రూవ్ చేసిందని చెప్పాలి.