Begin typing your search above and press return to search.
యుకేని స్ట్రెయిన్ ఒణికిస్తుంటే ప్రియానిక్ సంబరమేల?
By: Tupaki Desk | 26 Dec 2020 1:15 PM ISTఊరంతా టెన్షన్ లో ఉన్నా ఆ జంటకు మాత్రం సెలబ్రేషన్ కి కొదవేమీ లేదు. అసలు మాకిది ఏమాత్రం పట్టదు! అన్నట్టుగానే ఉంది వ్యవహారం. ఓవైపు కరోనా కొత్త రూపం స్ట్రెయిన్ యుకే (బ్రిటన్)ని ఒణికించేస్తుంటే.. వీళ్లు మాత్రం లండన్ లో తాపీగా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
తాజాగా రివీలైన ప్రియానిక్ కొత్త ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది. ప్రియాంక చోప్రా తన అభిమానుల కోసం ప్రత్యేక క్రిస్మస్ సందేశాన్ని ఇలా ఫోటో ద్వారా పంచుకుంది. ప్రతి ఒక్కరికి మెర్రీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ విష్ చేసింది. ఈ జంట పెంపుడు కుక్క డయానాతో కలిసి ఇలా ఫోజులిచ్చారు. `పర్ఫెక్ట్` అనే క్యాప్షన్ తో పీసీ దీన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అదే చిత్రాన్ని పంచుకున్నాడు. అంతేకాదు.. క్యాప్షన్ లో వారు తమ ఇతర కుక్కలను కోల్పోతున్నామని కలత చెందారు.
ప్రియాంక - నిక్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడ ఆమె తన కొత్త చిత్రం `టెక్స్ట్ ఫర్ యు` చిత్రీకరణలో ఉంది. ఈ వారం ప్రారంభంలో ఆమె తన వింటర్ షికారు నుండి కొన్ని చిత్రాలను పీసీ షేర్ చేసింది. కానీ యుకె లో మరో లాక్ డౌన్ వల్ల ప్రియాంక కొంతకాలం అక్కడే ఉండిపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్ ని నిలిపేశారు. యుఎస్ కు తిరిగి వెళ్లడానికి ప్రత్యేక అనుమతులు కోరారట. అయితే లాక్‌డౌన్ నియమాలు గతంలో కంటే కఠినంగా మారడంతో రిటన్ టికెట్ రావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. ప్రియాంక మిగిలిన యూనిట్ కొంతకాలం UK లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇటీవలే రాబర్ట్ రోడ్రిగెజ్ `వి కెన్ బీ హీరోస్`లో కనిపించిన ప్రియాంక, అనేక వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. జనవరిలో `ది వైట్ టైజ్` లో నటించనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పీసీకి లాభదాయకమైన ఒప్పందం ఉంది. ఇది పలు భాషలలో కంటెంట్ ను ఉత్పత్తి చేసే ప్రయత్నం. అలాగే బ్లాక్ బస్టర్ సిరీస్ `మ్యాట్రిక్స్ 4` చిత్రీకరణలోనూ పీసీ పాల్గొంది. ఓషో సహాయకుడు మా ఆనంద్ షీలా బయోపిక్ కూడా చిత్రీకరణలో ఉంది.