Begin typing your search above and press return to search.

ఇది ప్రియాంక చోప్రా రేంజ్.. భర్త నిక్‌ బర్త్‌డే కి ఏం చేసిందో తెలుసా!

By:  Tupaki Desk   |   16 Sep 2022 11:29 AM GMT
ఇది ప్రియాంక చోప్రా రేంజ్.. భర్త నిక్‌ బర్త్‌డే కి ఏం చేసిందో తెలుసా!
X
గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ లు పెళ్లి చేసుకున్న సమయంలో వీరిద్దరి వయసు తేడా 10 సంవత్సరాలు.. అంతే కాకుండా అతడి కంటే ఆమె పదేళ్లు పెద్ద. ఎలా వీరి జంట ముందుకు వెళ్తుంది అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.

పెళ్లి హడావుడి తగ్గకముందే.. పెళ్లి వార్తలు కంటిన్యూ అవుతున్న సమయంలోనే వీరి విడాకుల ప్రస్థావన వచ్చే అవకాశం ఉందని కొందరు విమర్శించారు.

మరి కొందరు దారుణంగా నిక్ డబ్బు కోసమే ప్రియాంక చోప్రా అతడిని పెళ్లి చేసుకుంది అంటూ విమర్శించిన వారు ఉన్నారు. విమర్శలన్నింటికి కూడా నిక్‌ మరియు ప్రియాంక చోప్రాలు సరైన సమాధానం ఇచ్చారు.. ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఇద్దరి యొక్క అన్యోన్యం చూసి గతంలో ఆ వ్యాఖ్యలు విమర్శలు చేసిన వారు నోరు మూసుకుని ఉంటారు.

తాజాగా మరోసారి ఆ విమర్శలు చేసిన వారికి కౌంటర్‌ గా ప్రియాంక చేసిన పని నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే... నిక్ జోనస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు అతడిని పెద్ద సర్‌ ప్రైజ్ ప్లాన్‌ చేసింది.

తాను ఒక గ్లోబల్‌ స్టార్‌ అవ్వడంతో ఆ స్థాయిలోనే భర్త నిక్ కి సర్‌ ప్రైజ్ ఇచ్చింది. భర్త పుట్టిన రోజుకు ఏకంగా ప్రైవేట్‌ జెట్‌ ని బుక్ చేసింది.

ఆకాశంలో ప్రియాంక చోప్రా అతడి యొక్క బర్త్‌ డేని నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్రైవేట్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానంను బుక్ చేయడం జరిగింది. ఆ విమానంలో అన్ని ఏర్పాట్లు చేసి అతడిని చివర్లో విమానం ఎక్కించారు. లోనికి వెళ్లి చూసి నిక్ జోనస్ సర్ ప్రైజ్ అయ్యాడు. అతడు షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రియాంక చోప్రా 40 లో అడుగు పెడితే నిక్‌ జోనస్‌ నేడు 30 లో అడుగు పెట్టాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.