Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎవ‌రీ స్కూల్ పాప‌? ఏమా లుక్కు!

By:  Tupaki Desk   |   12 Sept 2020 6:00 PM IST
ఫోటో స్టోరి: ఎవ‌రీ స్కూల్ పాప‌? ఏమా లుక్కు!
X
ప్రియాంక చోప్రా అలియాస్ పీసీ స్టైలింగ్ గురించి చెప్పాలా?.. అందాల రాణిగా క్యాట్ వాక్ చేసే రోజుల నుంచి ఫ్యాషన్స్ ప‌రంగా త‌న స్టైలే వేరు. ఇక స్టైలింగ్ విష‌యంలో ఎప్ప‌టికప్పుడు ప్ర‌యోగాలు చేయ‌డం త‌న‌కు అల‌వాటు వ్యాప‌క‌మే. ఇప్పుడు అమెరికా కోడ‌లు అయ్యాకా ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.

తాజాగా సోష‌ల్ మీడియాల్లో ప్రియాంక చోప్రా స‌రికొత్త హెయిర్ స్టైల్ తో క‌నిపించి షాకిచ్చింది. చూడ‌టానికి స్కూల్ పాప‌లా ఏజ్ స‌గం త‌గ్గిపోయింది. ఎవ‌రీ టీనేజీ పాప‌? అనేంత‌గా మేకోవ‌ర్ ఆ హెయిర్ స్టైల్ వ‌ల్ల కుదిరింది. ఎవ‌రీ స్కూల్ పాప‌? ఏమా లుక్కు! అంటూ సోష‌ల్ మీడియా అనుచ‌రులు ఒక‌టే ఇదిగా పంచ్ లు విసిరేస్తున్నారు.

ఎమ్మీ అవార్డులలో రెడ్ కార్పెట్ వేషధారణ లేదా మెట్ గాలా కేశాలంకరణ అయినా ప్రియాంక చోప్రా స్టైలే వేరు క‌దా! మాజీ ప్ర‌పంచ సుంద‌రిగా ఈ మిస్ దివా ఎల్లప్పుడూ తన ఫ్యాషన్ ఎంపికలు ఆన్-ఫ్లీక్ లుక్స్ విష‌యంలో ఎక్క‌డా రాజీకి రాదు. ప్రతి అందమైన వస్త్రధారణతో ఒక ఆహ్లాదకరమైన ప్రయోగాత్మక కేశాలంకరణను ప్ర‌ద‌ర్శించ‌డం పీసీకే చెల్లింది. హాటీ విభిన్న హెయిర్ స్టైల్ తో ఆడుకుంటుంది. ప్రియాంక తన జుట్టు కోసం ఉపయోగించే ఇంట్లో తయారుచేసుకునే విష‌యాల్ని వెల్ల‌డించింది.

ఇదివ‌ర‌కూ వోగ్ ఇండియాతో మాట్లాడుతూ, `` పెరుగు.. ఒక టీస్పూన్ తేనె..ఒక గుడ్డును ఒక గిన్నెలో కలపండి. ఈ మిశ్రమాన్ని నేరుగా నెత్తిమీద ముసుగుగా వేయండి. 30 నిమిషాలు అలాగే గోరువెచ్చని తో కడగాలి నీరు లేదా బేబీ షాంపూ వాడాలి`` అని తెలిపింది.