Begin typing your search above and press return to search.
ఈ బేవాచ్ బ్యూటీ పియానో ప్లే చేస్తుందట!
By: Tupaki Desk | 14 May 2020 5:00 AM ISTకరోనా కారణంగా సినిమా హీరో హీరోయిన్లంతా ఎన్నడూ లేని విధంగా ఇళ్లలో కాలక్షేపం చేస్తున్నారు. సరదాగా కుటుంబంతో గడపడం, పిల్లలతో ఆడుకోవడం, గార్డెనింగ్, వంట చేయడం, కొందరేమో కొత్త సినిమాల కోసం స్క్రిప్టులు వినడం ఇలా ఏదోకటి చేస్తూ బిజీ అయ్యారు. గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అయితే యంగ్ సింగర్ నిక్ జోనస్ తో హోమ్ క్వారంటైన్ లో ఎంజాయ్ చేస్తుంది. కొత్తగా పెళ్లయింది కదా భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్ లో నివసిస్తూ వివాహ బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. ఇక ఎలాగో గృహ నిర్బంధంలో ఉంది కదా.. సరదాగా వంటలు చేస్తూ.. ఫిట్నెస్ ప్రయోగాలు చేస్తూ కాలం గడిపేస్తుందేమో.. అనుకుంటే పొరపాటే. హాలీవుడ్ లో అవకాశం వచ్చాక ప్రియాంక అసలు మళ్లీ ఇండియన్ సినిమాలలో కనిపించలేదు.
పూర్తిగా ఇంగ్లీష్ సీరియల్స్, వెబ్ సిరీస్లు, సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న ప్రియాంక భర్త ఒడిలో కూర్చొని పియానో నేర్చుకుంటుందట. "నాకు ప్లే చేయడమంటే చాలా ఇష్టం.. కానీ వాయించే తీరిక ఇంతవరకు దొరకలేదు. అందుకే అనుకోకుండా వచ్చిన లాక్ డౌన్ సెలవులను పియానో నేర్చుకోవడానికి వినియోగిస్తున్నా అంటుంది. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ప్రియాంక.. భర్త నిక్ జోనాస్ పాఠాలు వింటూ పియానో ప్లే చేయడం ప్రాక్టీస్ చేస్తుందట. "నాకు పియానో ప్లే చేయడం ఇష్టమని తెలుసుకొని.. నా భర్త ప్రతి రోజూ ఓ గంట సమయాన్ని నాకు పియానో నేర్పించడానికి కేటాయిస్తున్నారు.
అంతేగాక ఈ మధ్య డాన్స్ కూడా చాలా మిస్ అవుతున్న ఫీల్ కలిగింది. వెంటనే ఆలస్యం చేయకుండా హిప్ హాప్ డాన్స్ నేర్చుకుంటున్నా.. అంటూ తెలిపింది ప్రియాంక. ఈ కరోనా వలన రెండు నెలలుగా ఇంటి నుండి బయటికి రాకుండా ఉన్న ప్రియాంక.. బయటికి వచ్చి "నిక్ డయాబెటిక్ కావడంతో వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లామనీ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాం. ఇద్దరం ఒకేచోట ఉంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇటీవలే రెండు నెలల తర్వాత బయటకు అడుగుపెట్టిన ప్రియాంక.. ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ని రోజులకు నెట్టింట్లో పోస్ట్ కన్పించడంతో ఈ బేవాచ్ బ్యూటీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.