Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్ కి చైతూ థ్యాంక్యూ చెప్తాడా...?

By:  Tupaki Desk   |   7 Nov 2020 2:30 AM GMT
నాని హీరోయిన్ కి చైతూ థ్యాంక్యూ చెప్తాడా...?
X
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'మజిలీ' 'వెంకీమామ' వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకుని మంచి జోష్ లో ఉన్నాడు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న చైతన్య.. ఇటీవలే 'థ్యాంక్యూ' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌ రాజు - శిరీష్‌ - హ‌ర్షిత్ రెడ్డి లు కలిసి నిర్మించనున్నారు. బీవీఎస్‌ఎన్ రవి స్టోరీ అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఇందులో చైతన్య సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటించనున్నారట.

కాగా, 'థ్యాంక్యూ' చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ని ఒక హీరోయిన్ గా ఎంపిక చేసారట. ప్రియాంకా మోహన్ ఇంతకముందు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాని 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కూడా టాలెంటెడ్ హీరోయిన్ ని తీసుకున్నారట. ప్రస్తుతం ఈ బ్యూటీ శర్వానంద్‌ 'శ్రీకారం' సినిమాలో నటిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. విక్రమ్ కె కుమార్ అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం అందించడంతో 'థ్యాంక్యూ' పై అభిమానులు మంచి అంచనాలే పెట్టుకున్నారు.