Begin typing your search above and press return to search.

ఈసారైనా టాలీవుడ్‌ లో ఈమె బిజీగా మారేనా?

By:  Tupaki Desk   |   6 March 2021 6:30 AM GMT
ఈసారైనా టాలీవుడ్‌ లో ఈమె బిజీగా మారేనా?
X
నాని నటించిన 'గ్యాంగ్‌ లీడర్‌' సినిమాలో హీరోయిన్‌ గా నటించి క్యూట్‌ అమ్మాయిగా పేరు దక్కించుకున్న ప్రియాంక అరుల్‌ మోహన్‌ రెండవ సినిమాకు కాస్త ఎక్కువ గ్యాపే తీసుకుంది. గ్యాంగ్ లీడర్ విడుదల అయిన వెంటనే చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా కూడా ప్రియాంక వాటిని పట్టించుకోకుండా మంచి పాత్ర అవ్వడంతో పాటు యంగ్ ట్యాలెంటెడ్‌ హీరో అవ్వడం వల్ల శర్వానంద్‌ తో కలిసి శ్రీకారం సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. తెలుగులో ఒక్కటి రెండు సినిమాలతోనే స్టార్ లు అవుతున్న హీరోయిన్స్ ఉన్న ఈ సమయంలో ప్రియాంక మోహన్‌ కనీసం శ్రీకారం సినిమాతో అయినా బిజీ అయ్యేనా అనే చర్చ మీడియా సర్కిల్ లో వినిపిస్తుంది.

తమిళంలో ఈమె నటించిన డాక్టర్ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. శ్రీకారం మరియు డాక్టర్‌ సినిమాలతో ప్రియాంక మోహన్‌ అక్కడ ఇక్కడ బిజీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. శ్రీకారం విడుదల అయ్యే వరకు కొత్త సినిమాలకు ఓకే చెప్ప కూడదనే ఉద్దేశ్యంతో ప్రియాంక ఇంకా దేనికి సైన్ చేయలేదని తెలుస్తోంది. శ్రీకారం విడుదల అయ్యి సక్సెస్‌ దక్కించుకుంటే ఇక ప్రియాంక మోహన్‌ టాలీవుడ్ లో యంగ్ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశం ఉంది. మొదటి రెండు సినిమాల్లో కూడా ఈమె గ్లామర్ షో చేయలేదు. ముందు ముందు ప్రియాంక మోహన్‌ గ్లామర్‌ గా కనిపించేందుకు ఒప్పుకుంటుందేమో చూడాలి.