Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : గ్యాంగ్‌ లీడర్ బ్యూటీ అందాల డోస్ పెంచుతోంది

By:  Tupaki Desk   |   12 July 2022 12:30 AM GMT
పిక్ టాక్ : గ్యాంగ్‌ లీడర్ బ్యూటీ అందాల డోస్ పెంచుతోంది
X
నాని గ్యాంగ్ లీడర్ సినిమా తో పాటు శర్వానంద్‌ తో శ్రీకారం సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్‌ మోహన్‌. రెండు సినిమాల్లో కూడా చాలా పద్దతైన పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపించి మెప్పించిన ఈ అమ్మడు తమిళంలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. శివ కార్తికేయన్ తో డాక్టర్ మరియు డాన్‌ సినిమాల్లో నటించి సక్సెస్ లు దక్కించుకుంది.

సినిమాల ఎంపిక విషయంలో ఈ అమ్మడు ఆచితూచి వ్యవహరిస్తుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా వచ్చిన గుర్తింపు మాత్రం ఎక్కువే. ఈమె స్కిన్ షో విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు ఇప్పటి వరకు లేదు. కాని తాజా పరిణామాలు చూస్తుంటే ఈ గ్యాంగ్‌ లీడర్ బ్యూటీ అందాల డోస్ పెంచుతున్నట్లు గా అనిపిస్తుంది.

ఆమద్య నడుము అందాన్ని ఎక్స్‌ పోజ్‌ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి. హీరోయిన్ గా ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు చేసేందుకు సిద్ధం అన్నట్టుగా ఆ ఫోటోలతో చెప్పకనే చెప్పింది. హీరోయిన్ గా ఇక ముందు చేయబోతున్న సినిమాల్లో ఒక మోస్తరు వరుకు అందాల ఆరబోత కు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా మరోసారి ఈ అమ్మడు తాజా ఫోటో షూట్ తో తేల్చి చెప్పింది.

ప్రియాంక తాజాగా షేర్‌ చేసిన ఫోటోల్లో షర్ట్‌ బటన్స్ పూర్తిగా తీసేసి నడుము అందాన్ని చూపిస్తూ మతులు పోగొడుతోంది. సాదారణంగా ముద్దుగుమ్మలు స్కిన్ షో చేయకుండా అప్పుడప్పుడు ఇలా నడుము కనిపించి కనిపించకుండా ఎక్స్‌ పోజ్‌ చేసినా కూడా హాట్‌ టాపిక్ అవుతుంది. ఇప్పుడ ప్రియాంక మోహన్‌ విషయంలో అదే జరుగుతుంది.

ఈమె చిన్న ఎక్స్‌ పోజింగ్‌ కే అందాల డోస్ పెంచుతున్న ప్రియాంక అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. కొందరు మాత్రం ప్రియాంక హాట్‌ గా కంటే కూడా క్యూట్‌ గానే ఎక్కువ అందంగా ఉంటుంది. అందుకే ముందు ముందు ఈ అమ్మడు హాట్ అందాలను షేర్‌ చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ అమ్మడి ముందు ముందు అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.