Begin typing your search above and press return to search.
'శ్రీకారం' హీరోయిన్ ని ఎందుకు దాచిపెడుతున్నారు...?
By: Tupaki Desk | 18 April 2020 5:00 PM ISTఆ బ్యూటీ ఇందులో హీరోయిన్..! అయ్యో ఎంత మందికి తెలుసు ఈ నిజం..! ఎందుకు స్వామీ హీరోయిన్ ని అలా దాచేయడం..! ఇలాంటి డైలాగ్స్ మనం అప్పుడప్పుడు కొన్ని సినిమాల విషయాల్లో వింటూనే ఉంటాం. ఒక సినిమా పబ్లిసిటీకి హీరోతో పాటు హీరోయిన్ కూడా ఎంత అవసరమో తెలిసిందే. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి.. సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు హీరోతో పాటు హీరోయిన్ పేరు కూడా జనాల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే హీరో పక్కన హీరోయిన్ లేకుంటే ఆ లోటు కచ్చితంగా సినిమా కలెక్షన్స్ లో కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒక సినిమా చూడటానికి ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పించడానికి హీరోయిన్ గ్లామర్ కూడా చాలా అవసరమనే విషయం అందరికి తెలిసిందే. కేవలం హీరోయిన్ కోసమే థియేటర్లకు వచ్చే ఆడియన్స్ చాలా మంది ఉంటారు. కాకపోతే కొంతమంది హీరోయిన్ క్యారెక్టర్ రివీల్ అవ్వకుండా ఉండటానికి ఆమెని పబ్లిసిటీకి వాడుకోకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటారు. ఇది ఒక్కోసారి సినిమాకి ప్లస్ అయినా ఎక్కువసార్లు మైనస్ అయిందనే చెప్పాలి. గతంలో హీరోయిన్ ని దాచిపెట్టి.. కనీసం ఆ హీరోయిన్ పేరు కూడా రివీల్ చేయకుండా.. సినిమా విడుదలయ్యే దాకా ఆ హీరోయిన్ ఎవరో తెలియకుండా చేసిన ఓ స్టార్ హీరో సినిమా గతి ఏమైందో అందరికి తెలిసిందే. దీని కారణంగా ఆ సినిమాని సగటు ప్రేక్షకుడు పట్టించుకోలేదు. దీంతో డిజాస్టర్ గా మిగిలిపోయి.. ఆ హీరోయిన్ కి కెరీర్ కూడా లేకుండా చేసింది.
ఇప్పుడు తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఒక సినిమా విషయంలో ఇలాంటిదే రిపీట్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే యువ హీరో శర్వానంద్ నటిస్తున్న చిత్రం 'శ్రీకారం'. ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇంతకు మించి ఈ సినిమా వివరాలు ఎవరికీ తెలియదు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు హీరోతో పాటు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేసినప్పటికీ హీరోయిన్ ని మాత్రం ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈ 'శ్రీకారం'లో హీరోయిన్ గా 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక మోహన్ నటిస్తోందని ఎంతమందికి తెలుసు చెప్పండి. నిజానికి చాలా తక్కువ మందికి మాత్రమే ఆ అమ్మడు ఈ సినిమాలో హీరోయిన్ అని తెలుసు. అయితే ఎందుకు ఈ బ్యూటీ ఇందులో నటిస్తోందని బయటకు చెప్పడం లేదనే ప్రశ్న అందరిలో కలుగుతోంది. ఈ సినిమాలో ప్రియాంక క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట.. అందుకే కొత్తగా ప్రమోట్ చేయడానికి ఏదో ప్లాన్ చేస్టున్నారట ఈ సినిమా టీమ్. పాపం.. ప్రియాంక కు ఈ సినిమాతో అయినా సరైన గుర్తింపు వస్తుందని భావించింది. పరిస్థితులు చూస్తుంటే ఇది కూడా నిరాశే మిగిల్చేలా ఉందిగా అంటున్నారు సినీ అభిమానులు. ఏదేమైనా కొత్త తరహా పబ్లిసిటీ అంటూ పోయి మొదటికే మోసం తెచ్చుకోకుండా ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారు.