Begin typing your search above and press return to search.

ఉయ్యాల‌వాడ' కు బాలీవుడ్‌ హీరోయిన్ల షాక్‌!

By:  Tupaki Desk   |   19 Jun 2017 8:14 PM IST
ఉయ్యాల‌వాడ కు బాలీవుడ్‌ హీరోయిన్ల షాక్‌!
X
బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని తెరకెక్కించాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు తమిళ హిందీ ఇండస్ట్రీలో పలువురు టెక్నీషియన్లను నటీనటులను సంప్రదించారని సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో చిరుకు జతగా నటించాలని పలువురు బాలీవుడ్ భామలను సంప్రదించినా ఫలితం దక్కలేదట.

చిరు వయస్సుకు తగ్గట్లు ఐశ్వర్యా రాయ్ విద్యా బాలన్లను ఈ సినిమాలో నటించేందుకు సంప్రదించారు నిర్మాతలు. వారి నుంచి ఎటువంటి స్పందన లేదరని సమాచారం. తాజాగా ప్రియాంకా చోప్రా సోనాక్షీ సిన్హాలను కలిశారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

అయితే ప్రస్తుతం ప్రియాంకా చోప్రా హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె బాలీవుడ్ సినిమాలకు షెడ్యూల్ ఇవ్వడానికే సమయం చాలడం లేదట. గతంలో రజనీ సరసన లింగా చిత్రంలో సోనాక్షీ నటించింది. ఆ సినిమాలో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు. దీంతో ఆమె మరో సౌత్ ఇండియన్ మూవీలో నటించేందుకు అనాసక్తి చూపుతోందట.

దీంతో హీరోయిన్ విషయంలో నిర్మాతలు తల పట్టుకుంటున్నారట. ఈ నేపథ్యంలో చిరు సరసన నటించేందుకు అనుష్కను సంప్రదించారట నిర్మాతలు. తన కాల్షీట్లను అడ్జస్ట్ చేసుకొని అనుష్క చిరుతో స్టెప్పులేస్తుందో? లేదో? వేచి చూడాలి.