Begin typing your search above and press return to search.

అమ్మాయిలని ఇండియా నుంచి పొమ్మంటోంది

By:  Tupaki Desk   |   4 May 2016 12:28 PM IST
అమ్మాయిలని ఇండియా నుంచి పొమ్మంటోంది
X
దేశంలో అమ్మాయిలకు భద్రత లేదంటూ హీరోయిన్ ప్రియమణి చేసిన కామెంట్స్.. ఇప్పుడు సంచలనంగా మారాయి. బెంగళూరులో ఓ అమ్మాయిని అందరూ చూస్తుండగానే కిడ్నాప్ చేయడం, కేరళలో జిషా అనే మహిళను రేప్ చేసి చంపేయడంపై తట్టుకోలేకపోయిన ప్రియమణి.. స్పందించింది. అయితే తన స్పందనను మరీ ఘాటుగా తెలియచేయడంతో విమర్శలకు గురికావాల్సి వస్తోంది.

'మరో రేప్ అండ్ మర్డర్ గురించి తెలిసి షాక్ తిన్నాను. భారత దేశంలో మహిళలకు భద్రత కలిగించగలదని అనుకోవడం లేదు. రేప్ చేయడం కోసం బెంగళూరులో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఇక్కడి పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. ఇండియా ఇక ఎంతమాత్రం భద్రత గలదేశం కాదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. దేశంలోని మహిళలు, అమ్మాయిలు ఇండియా వదిలేసి వేరే ఏదైనా భద్రత కల ప్రదేశానికి వెళ్లిపోవాలని అర్ధిస్తున్నా' అంటూ ట్వీట్ చేసింది ప్రియమణి.

అయితే ఈ ట్వీట్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో పాటు.. దేశాన్ని అవమానించేలా ఉన్నాయంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో "నేను ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పటికే జరిగిన, ఇంకా జరుగుతున్న సంఘటనలపై నా అభిప్రాయాలను మాత్రమే చెప్పాను. ఇది దేశానికి వ్యతిరేకం ఎలా అవుతుంది ??" అంటూ మరో ట్వీట్ చేసి నిలదేసింది ప్రియమణి.